రమణ దీక్షితులు వివాదంలో టిటిడి ఉద్యోగ సంఘాల తడబాటు!

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదంలో టిటిడి ఉద్యోగ సంఘా నేతలు వేరువేరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందరి ప్రకటన సారాంశం దాదాపు ఒకటిగానే ఉంది. అందరూ రమణ దీక్షితులను తప్పుబడుతున్నారు. టిటిడి ప్రతిష్ట తెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. రిటైర్‌మెంట్‌ మామూలే కదా…ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. టిటిడిపై విమర్శలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

ముందుగా ఉద్యోగ విరమణ గురించి చర్చిద్దా…సన్నిధి గొల్లను రిటైర్‌ చేస్తే యాదవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అది ఉద్యోగం కాదని, వంశపారంపర్యంగా వస్తున్న సేవ అని ఈ సంఘాలు వాదించాయి. టిటిడి పరిపానాల భావనం ఎదుట కూడా దీక్షలు జరిగాయి. ఈ ఆందోళనకు టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు మద్దతు ఇచ్చారు. ఇప్పడు రమణ దీక్షితులు వ్యవహారంలో భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ వ్యవహారంలో రమణ దీక్షితులు బాధితుడు. సహజంగానే బాధితుల వైపు నిలవాలి. ఆరోపణలు చేసిన 24 గంటల్లో ఆయన్ను విధుల్లో నుంచి తొలగించారు. దీని సమర్థిస్తే…రేపు ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రటనలు చేసే నాయకులపైనా ఇలాంటి చర్యలకు టిటిడి అధికారులు తెగబడబోరన్న భరోసా ఏమీవుండదు. రమణ దీక్షితులు తప్పు చేశారనుకుంటే… ఆయన్ను సంజాయిషా అడగొచ్చు. శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. అదీ నిబంధనల ప్రకారం టిటిడికి ఆ అధికారం ఉంటేనే. అది వదిలేసి, 24 గంటల్లో ఆయన్ను వీధుల్లోకి నెట్టేసి, మాతో పెట్టుకుంటావా అన్నట్లు అధికారులు వ్యవహరించారు. ఇక తొలగింపు నోటీసులు ఇంటికి అంటించిన తీరు అత్యంత అవమానకరంగా ఉంది. ఏ విధంగా చూసినా రమణ దీక్షితులు బాధితుడే.

ఇక రమణ దీక్షితులు లేవనెత్తతున్న అంశాలు చాలా కీలకమైనవి. ఇందులో అధికారుల నియంతృత్వ పోకడలకు సంబంధించి విషయాలూ ఉన్నాయి. అధికారుల్లో అలాంటి ధోరణులపై ఉద్యోగులే ఇటీవల రెండు పర్యాయాలు అందోళనబాట పట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఉదంతంగానీ, మొన్న ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేయలేదన్న కారణంగా ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన వైనంగానీ….ఈ ధోరణులకు సంకేతం కాదా? ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగకుండా అధికారులు తొంతరపెడుతున్నారని దీక్షితులు ఆరోపిస్తున్నారు. ఇందులోని వాస్తవ అవాస్తవాలు ఏమిటో తేల్చాల్సిన అవసరం లేదా? ఇది టిటిడి ప్రతిష్టను భంగపరచినట్లు అవుతుందా? పూజాది వ్యవహారాల్లో అధికారులకు ఏంపని? పోటును ఈవో అనుమతి కూడా లేకుండా తవ్వేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈవోకి కూడా తెలియకుండా నిర్ణయం తీసుకునేంత తెగింపు ఉన్న అధికారులెవరో బహిర్గతం కావాల్సిన పనిలేదా? ఇక పింక్‌ డైమైండ్‌ విషయానికొస్తే…అది వజ్రమే అని ఆయన చెబుతున్నారు. కాదు అని అధికారులు అంటున్నారు. దీనిపైన విచారణ జరిగడం వల్ల వచ్చే నష్టమేముంది? ఆలయ ప్రధాన అర్చకులే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమో చొరవ తీసుకుని విచారణ జరిపించాల్సిన అవసరం లేదా?

రమణదీక్షితులు వ్యవహారంలో అధికారులు…తెలివిగా అంరినీ వాడుకుంటున్నారు. అర్చకులను రెండుగా విభజించేశారు. మీడియాలోని కొందరిని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల విషయంలోనూ ఇదే చేస్తున్నారు. అయినా…రమణ దీక్షితులు వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయన్న విమర్శలూ చేస్తున్నారు. ఆయన వెనుక మాత్రమేకాదు…ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా ఈ వివాదంతో రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు. లేకుంటే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చేవాళ్లు కాదు. విమర్శలు చేసిన 24 గంటల్లో రమణ దీక్షితులును తొలగించేవాళ్లు కాదు. ఆచితూచి వ్యవహరించేవాళ్లు. ఈ వివాదానికి సహేతుకమైన ముగింపు పలకాలంటే….ఏదైనా నిష్పాక్షికమైన విచారణ జరిగాలి. ఏవైనా అక్రమాలు జరిగివుంటే బాధ్యులను శిక్షించాలన్నా…ఏమీ జరగలేదని టిటిడి అధికారులకు క్లీన్‌ చిట్‌ రావాలన్నా విచారణ జరిపించడమే ఏకైక పరిష్కారం. లేదంటే…ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇలా సాగుతూనేవుంటుంది. సమగ్ర విచారణ జరిపించాలన్నదే ఉద్యోగ సంఘాలూ చేయాల్సిన డిమాండ్‌.

2 Comments

  1. .చెట్టు పేరు చెపుతారు ఆకులు, కాండం ..ఉంటే పళ్ళని చూసి.. కాని వేరు చూసి అందరు చెప్పలేరు..

Leave a Reply

Your email address will not be published.


*