రమణ దీక్షితులు… శ్రీవారి ఆలయంలోకి అర్ధరాత్రి ఎవరిని తీసుకెళ్లారు?

టిటిడిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి మండిపడుతున్నారు. ఆయన అర్చకత్వాన్ని వదిలేసి రాజకీయాలను వృత్తిగా తీసుకున్నట్లున్నారు అని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన ఆయన…ముఖ్యమైన ఆరోపణ చేశారు. అతిథిగృహాలకు వెళ్లి విఐపిలను ఆశీర్వదించడ మేకాకుండా….నిబంధనలకు విరుద్ధంగా ఆర్ధరాత్రి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారని ఆరోపించారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే ఆలయ ప్రధాన అర్చకుడైనా ఎవరినీ ఆలయంలోకి తీసుకెళ్లే అవకాశం లేదు. రమణ దీక్షితులకు బంధువులో, తెలిసినవారో దర్శనానికి వచ్చినా….టిటిడి నిబంధనల ప్రకారం జెఈవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. జెఈవో పరిశీలించి టికెట్లు మంజూరు చేస్తారు. ఆపై టికెట్లను కొనుగోలు చేసి లోనికి తీసుకెళ్లాలి. అదీ ఏ టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు ఏ మార్గంలో ఆలయ ప్రవేశం చేయాలని నిర్దేశించివుంటే…ఆదే మార్గంలో వెళ్లాలి. అంతేగానీ విఐపిలు అయినంత మాత్రాన…ముహాద్వారం గుండానో, ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిగ్‌ మార్గంగుండానో వెళ్లడానికి వీల్లేదు. ప్రధాన అర్చకుడు తోడుగా ఉన్నా ఇతరులను ఈ మార్గాల్లో అనుమతించరు. అలాంటిది జెఈవో టికెట్లు మంజూరు చేయకుండానే విఐపిలను అర్ధరాత్రి దర్శనానికి తీసుకెళ్లారా, పూజలు చేయించారా? అనేది ప్రశ్న. సాధారణంగా విఐపి బ్రేక్‌ సమయంలో మాత్రమే భక్తలకు లోపల శ్రీవారి ముందు హారతి ఇస్తారు. మిగతా సమయాల్లో విఐపిలు వచ్చినా…ప్రత్యే అనుమతితో ఆలయంలోకి ప్రవేశించినా…స్వామివారి ముందుకు వెళ్లడానికి వీలుండదు. ఇటువంటి నిబంధనలన్నీ ఉంటే….రమణ దీక్షితులు అర్ధరాత్రి లోనికి తీసుకెళ్లి ఎలా పూజలు చేయించారో అంతు చిక్కడం లేదు.

ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణల కేవలం రమణ దీక్షితులుకు సంబంధించినవి కావు. ఆలయ నిర్వహణ, నియమ నిబంధనలకు సంబంధించిన అంశం. ఒకవేళ టికెట్లుతో పని లేకుండా పలుకుబడి కలిగిన వ్యక్తుల సిఫార్సులతో విఐపిలను అర్ధరాత్రి అపరాత్రి ఆలయంలోకి తీసుకెళుతున్నారా? ఇలాంటి వ్యవహారం ఎప్పుడు నుంచి సాగుతోంది? ఇది ఒక్క రమణ దీక్షితులకే పరిమితమా? ఇతర అర్చకులూ చేస్తున్నారా? ఇందులో అధికారుల ప్రమేయం ఏమిటి? అదితర అంశాలన్నీ ముడిపడివున్నాయి. అందుకే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను భక్తులకు తెలియజేయాల్సిన బాధ్యత టిటిడికి, ప్రభుత్వానికి ఉంది. ఈ విధంగానైనా ఆలయంలో జరుగుతున్న అక్రమాలు బయటికొస్తే శ్రీవారితో పాటు శ్రీవారి భక్తులూ సంతోషిస్తారు. ఈ ఆరోపణలపైన రమణ దీక్షితులూ స్పందించాల్సిన అవసరం ఉంది.

2 Comments

  1. ఆలయంలో అర్చకులు విచ్చలవిడిగా వ్యవహరి స్తూ కావలసినవారికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. వీనిపైవిచారణజరపాలి.

Leave a Reply

Your email address will not be published.


*