రమేష్‌ కుమార్‌ దాగుడుమూతలు..!

రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన రాసినట్లు చెబుతున్న లేఖపై కొత్త చర్చ మొదయింది. ఆ లేఖను తానే రాశానని రమేష్‌ కుమార్‌ చెప్పినట్లుగా పత్రికల్లో, టివి ఛానళ్లలో వార్తలొచ్చాయి. ఈ లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తీరు అనేక అనుమానాకు తావిస్తోంది.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం, దానిపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడం, ఎన్నిక నిబంధనావళిని తొగించాలని కోర్టు ఆదేశించడం, ఇంతలోనే‌ ఆర్డినెన్స్ తో రమేష్ కుమార్ పదవి నుండి వైదొలగడం….ఇవన్నీ తెలిసిన పరిణామాలే. సుప్రీం తీర్పు తరువాత…నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేంద్ర హోం శాఖకు రాసినట్లు చెబుతున్న ఓ లేఖ బయటకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో తనకు భద్రత లేదని, హైదరాబాద్‌ నుంచి పని చేసే అవకాశం కల్పించాని, నామినేషన్లలో అధికార పార్టీ భారీ అక్రమాకు పాల్పడందని ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా… ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి ఫ్యాక్టనిస్టు అని రానిసట్లు కూడా అందులో ఉంది.

ఈ లేఖను తాను రాశాననిగానీ, రాయలేదనిగానీ రమేష్‌ కుమార్‌ చెప్పలేదు. రమేష్‌ కుమార్‌ రాసివుంటే…ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందనే ప్రశ్న ముందుకు వచ్చింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి…రాజకీయ విమర్శల్లాగా ముఖ్యమంత్రిపై విమర్శు ఎలా చేస్తారన్న వాదనూ వినిపించాయి. లేఖపై పెద్ద దుమారం రేగుతున్నా..రమేష్‌ కుమార్‌ స్పందించలేదు.

ఈ క్రమంలో….ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేసేలా ఉన్న ఆ లేఖ రాసింది ఎవరో తేల్చాంటూ….వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌పై చేసిన సంతకానికీ, ఈ లేఖలో ఉన్న సంతకానికీ తేడా ఉందని, దాన్ని రమేష్‌ కుమార్‌ పేరుతో టిడిపి నాయకులే రాశారని విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసు విచారణ మొదుపెట్టారు.

ఈపరిస్థతుల్లో….ఆ లేఖ తానే రాశానని, ఇందులో మూడో వ్యక్తికి అభ్యంతరం ఏమిటో తనకు తెలియడం లేదంటూ రమేష్‌ కుమార్‌ మీడియాకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపినట్లు వార్తలొవచ్చాయి. ఆయన తాను చెప్పదచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఎందుకు చెప్పలేదో తెలియదు. కనీసం మీడియా ముందుకు వచ్చి చెప్పివున్నా సమంజసంగా ఉంటుంది. అలాకాకుండా వాట్సాప్‌ మెసేజ్‌ పంపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయినా…లేఖ బయటకు వచ్చి నెల రోజువుతుంటే… ఇప్పుడు స్పందించడం ఏమిటి?

వివాదాస్పద లేఖపై విచరణ జరుపుతున్న పోలీసు…రేపు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పిలిచి విచారించవచ్చు. అ లేఖలోని సంతకం గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపితే…. సంతకం గుట్టు బయటపడుతుంది. ఒకవేళ ఆయన రాసిన లేఖే అనుకున్నా….అది మీడియాకు ఎలా చేరింది? ఆయన ప్రమేయం లేకుండా చేరివుంటే….అత్యంత గోప్యంగా ఉండాల్సిన లేఖ బయటకు పొక్కడపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? ఇటువంటి అంశాలూ విచారణాంశాలు అవుతాయి.

ఈ పరిణామాన్నీ చూస్తుంటే….రాజకీయ చదరంగంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పావుగా మారిపోయినట్లు అర్థమవుతుంది. ఏ సందర్భంలోనూ ఆయన పారదర్శకంగా వ్యవహరించలేదని అనిపిస్తుంది. ఎన్నిక వాయిదా విషయంగానీ, లేఖ అంశంగానీ…దాగుడుమూతలు, అనుమానిత చేష్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రమేష్ కుమార్ సంతకాల్లోని తేడా…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*