రమణ దీక్షితులు రాజకీయ దీక్ష చేస్తున్నారు : కేఈ కృష్ణమూర్తి

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు అర్చకత్వం వదిలేసి రాజకీయ దీక్ష చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి k కృష్ణమూర్తి మండిపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రమణదీక్షితులు వ్యవహార తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ఆలయ పవిత్రతను దెబ్బ తీయడమే కాక ఎన్నో తప్పులు చేశారని చెప్పారు. గతంలో ఆయన చేసిన తప్పులు పైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొండలు పవిత్రత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వారు ఏమయ్యారో తెలుసుకోవాలని హితవుపలికారు. స్వామివారి ఆభరణాలు బంగారు నగలు అన్నీ భద్రంగా ఉన్నాయని, వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం అధికారులు లెక్కలు చూస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా రమణదీక్షితులు చాలా తీవ్రమైన అంశాలను లేవనెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు అయినప్పటికీ శ్రీవారి ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో తనకే తెలియదని తనకే తెలియదని చెప్పారు. ఆలయంలో జరగాల్సిన కైంకర్యాలను త్వరగా ముగించాల్సి ఉంది గా అర్చకుల పై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో, విస్తరణ పేరుతో శ్రీవారి ఆలయం ఆలయ నిర్మాణంలో ఇష్టానుసారం మార్పులు చేసారని చెబుతున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పటిదాకా టీటీడీ గాని, ప్రభుత్వం గానీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఈ అంశాలను మీడియాలో చెప్పడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తూ రమణదీక్షితులను ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం టిటిడికి లేదని రమణదీక్షితులు చెబుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని కూడా ఆయన వెల్లడించారు. టిటిడిలో వ్యవహారాలపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దీక్షితులు… ఇప్పటికీ అదే పట్టుదలతో ఉన్నారు. టిటిడి లో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశాలున్నాయి. రమణదీక్షితులు అటు వైసీపీతో, ఇటు బీజేపీతో సంబంధాల్లో ఉంటూ ఇదంతా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన పై కఠిన చర్యలకు సిద్ధమయింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*