రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ‌ల్‌కు చేదు అనుభ‌వం!

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌కు అప్పుడే చేదు అనుభ‌వం ఎద‌ర‌యింది. సినీ న‌టుడిగా ఉన్నప్పుడు అంద‌రూ ఆరాదించ‌వ‌చ్చుగానీ…రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక బుర‌ద‌జ‌ల్లుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌గ‌తిశీల ఆలోచ‌న‌లు క‌లిగిన న‌టుడు. ఆయ‌న కుల మ‌తాల‌కు వ్య‌తిరేకం. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు కూడా. అయితే…త‌ల్లిదండ్రుల లాగే పిల్ల‌లూ ఉంటార‌ని అనుకోలేం. పెద్ద‌ల అభిప్రాయాల‌తో పిల్ల‌లు ఏకీభ‌విస్తార‌ని లేదు. పెద్ద‌ల సిద్దాంతాల‌నే అనుస‌రిస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఇప్ప‌డు ఇదంతా ఎందుకంటే….త‌న కూతురు శృతివ‌ల్ల క‌మ‌ల్‌హాజ‌న్ విమ‌ర్శ‌లు ఎదుర్కొటున్నారు. ఏమి జ‌రిగిందంటే…..ట్విటర్‌లో కుల వ్యవస్థ గురించి కమల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయం చుట్టూ వివాదం ముసురుకుంటోంది. ‘నా ఇద్దరు కూతుళ్లను స్కూళ్లో చేర్పించే సమయంలో కులం, మతం వంటి కాలమ్స్‌ నింపమని అడిగినపుడు నేను వ్యతిరేకించాను. ఇటువంటి దృక్పథమే నా కుటుంబంలోని భవిష్యత్‌ తరాలకు అలవడుతుంది. ప్రతీ ఒక్కరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కుల వ్యవస్థ అనేది క్రమంగా నశించిపోతుంది. కేరళ కూడా ఇలాంటి పద్ధతినే అవలంబిస్తోంది’ అంటూ కమల్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఓ నెటిజన్‌… కమల్‌ పెద్ద కూతురు, ప్రముఖ హీరోయిన్‌ శృతీ హాసన్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకు వీడియో క్లిప్‌ పోస్ట్‌ చేశారు. ఆ ఇంటర్వ్యూలో తాను ‘అయ్యంగార్‌’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా శృతి చెప్పుకొచ్చారు.

దీన్నీ ఆధారంగా చేసుకుని నెటిజ‌న్లు క‌మ‌ల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ‘కేవలం స్కూలు అప్లికేషన్‌లో కులానికి సంబంధించిన కాలమ్‌ నింపకపోవడం వల్ల కుల వ్యవస్థ నశిస్తుందన్న మీ అభిప్రాయం తప్పు సార్‌. సమాజాన్ని సంస్కరించే కార్యక్రమం మీ ఇంటి నుంచే ప్రారంభించండి. పిల్లల ముందు కుల ప్రస్తావన తీయకుండా, వారు ఏ కులానికి చెందిన వారో తెలియకుండా పెంచితేనైనా మీరు కోరుకునే మార్పు వచ్చే అవకాశం ఉందంటూ’ ఓ నెటిజన్‌ ఘాటుగా విమర్శించాడు. ‘మీరు కులానికి సంబంధించిన కాలమ్‌ నింపలేదేమో గానీ మీ సామాజిక గుర్తింపు ఏమిటో మీ కూతురి మాటల ద్వారా బహిరంగంగానే తెలియజేశారు కదా’ అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. శృతి హాస‌న్ చిన్న‌పిల్ల కాదు. ఆమె త‌న కుల వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకం కాక‌పోవ‌చ్చు. దాన్ని అడ్డంపెట్టుకుని క‌మ‌ల్ వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు. ఆయ‌న సినిమాల‌కే ప‌రిమితం అయివుంటే….ఇలాంటివి వ‌చ్చేవి కావు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అందుకే బుర‌ద‌జ‌ల్ల‌డానికి చిన్న అవ‌కాశం దొరికినా వ‌దిలిపెట్ట‌రు. క‌మ‌ల్ విష‌యంలో జ‌రుగుతున్న‌ది అదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*