రామునికి లక్ష్మణుడిలా…ఎంఎల్ఏ వెంట కిషోర్ రెడ్డి..! కష్టాల్లో తోడుగా..విజయంలో నీడగా..!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

    అధికారం ఉన్నపుడు, పెద్ద నేతగా ఎదిగినపుడు చుట్టూ చాలామంది ఉంటారు. అయితే...సాధారణ నేతగా ఉన్నప్పటి నుంచే అనుచరులుగా ఉంటూ, నాయకుడి ఎదుగుదలకు చేయూత అందిస్తూ, తోడుగా నిలిచేవారు కొందరే ఉంటారు. శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డికి అలా మొదటి నుండి తోడుగా నీడగా ఉన్నవారిలో అత్యంత ముఖ్యులు ఆయన బంధువు, అనుచరుడు అయిన గున్నేరి కిషోర్ రెడ్డి ఒకరు. రామునికి లక్ష్మణుడులాగా మధుసూదన్ రెడ్డికి కష్టసుఖాల్లో తోడుగావుంటున్నారు కిషోర్ రెడ్డి.

ఎంఎల్ఎ కు తోడుగా…
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి ప్రస్తుత ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డికి దగ్గర బంధువు. వరసకు తమ్ముడవుతారు. ఎండి పుత్తూరు నుంచి శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో స్థిరపడిన కిషోర్ రెడ్డి 2004 ముందు పట్టణంలోఎస్టీడీ బూత్ పెట్టుకుని జీవనం సాగించేవారు. 2004 ఎన్నికల ముందు రాజకీయాల్లోకి బియ్యపు మధుసూదన్ రెడ్డి రాకముందు నుంచే ఆయన అనుచరుడిగా ముద్ర వేసుకున్నారు. 2004 నుంచి మధుసూదన్ రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేయడంతో ఆయన వెంటే ఉంటూ వచ్చారు. 2014లో వైకాపా తరపున మధుసూదన్ రెడ్డి పోటీచేసి ఓటమి చెందినప్పటికీ ఎన్నికల ముందుగాని, తర్వాత గాని ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల ముందు సొంత మండలమైన ఏర్పేడు మండలానికి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుని పార్టీ నేతలను కలుపుకుంటూ ముందుకెళ్లి తాజా ఎన్నికల్లో మండలంలో పార్టీకి తిరుగులేని మెజార్టీ తెప్పించి, ఎంఎల్ఎ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆయన విశ్వసనీయత గుర్తించిన ఎంఎల్ఎ, కిషోర్ రెడ్డిని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కమిటీ సలహా మండలి సభ్యులు గా నియమించారు.

ఏర్పేడు మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతా…
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కమిటీ సలహా మండలి సభ్యులు గున్నేరి కిషోర్ రెడ్డి తెలిపారు. పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న ఏర్పేడు మండలాన్ని ఎంఎల్ఎ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో పాపానాయుడుపేట ,ఏర్పేడు ప్రాంతాల్లో సంత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా మహిళల వంటింటి సమస్య కొంత వరకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. పలు గ్రామాల్లో బోర్లు వేయించి తాగునీటి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. అనేక గ్రామాల్లో శ్మశానవాటిక సమస్య పరిష్కరించినట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యం ఆరబెట్టుకుని భద్రపరచుకునేందుకు మండలంలో 24 చోట్ల కల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండి పుత్తూరు, సరస్వతి కండ్రిగ తదితర ప్రాంతాల్లో పొలాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు సరైన పరిహారం లభించక ఇబ్బందులు పడేవారని ఎంఎల్ఎ చొరవతో ఈ సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. మండలంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ధ్వేయమన్నారు. అందరినీ కలుపుకుని ఎంఎల్ఎ చొరవతో మండలాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు కిషోర్ రెడ్డి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*