రాయలసీమకే టిటిడి ఉద్యోగాలు….

  • సీమ ప్రజల కొంతుకేసే మెను రద్దు చేయాలి

  • సీమ ఉద్యమ సంఘాల డిమాండ్‌

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు రాయలసీమ వాసులకే ఇవ్వాలని రాయలసీమ ఉద్యమ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ఉత్వర్వుల ప్రకారం జోనల్‌ పద్ధతిలోనే టిటిడి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. టిటిడి ఉద్యోగాలకు రాష్ట్రం అన్ని జిల్లాలవారూ అర్హులేనంటూ ప్రభుత్వం ఇచ్చిన మెమెనూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాయలసీమ వ్యాపితంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.

రాయలసీమ ప్రాంతంలోని యువతీ యువకుల ఉపాధికి ఏకైన దిక్కుగా కనిపిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై సీమ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్వర్వుల ప్రకారం రాయలసీమ ప్రజలకే టిటిడి ఉద్యోగాల్లో హక్కువుంటుంది. అయితే…ఇందుకు భిన్నంగా రాష్ట్రం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని టిటిడిలో రిక్రూట్‌మెంట్‌ జరపవచ్చునంటూ ఇటీవల ఓ మెమెను ప్రభుత్వం జారీ చేసింది. ఆ మెమూ కొన్ని రోజుల క్రితమే బయటపడింది.

సీమ ప్రజల కొంతుకోసే మెమోను రద్దు చేయాలని కోరుతూ రాయలసీమ అధ్యయనాల సంస్థ, రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో తిరుపతి యూత్‌ హాస్టల్‌లో శనివారం (09.03.2019) రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమ ఉద్యమంలో చురుగ్గావున్న పలువురు నాయకులు, టిటిడి ఉద్యోగ సంఘాల పూర్వ నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మెమోను అందరూ ఏకకంఠంతో వ్యతిరేకించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపే మెమోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మెమో రద్దు కోసం రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

రాయలసీమ అధ్యయనాల సంస్థ నాయకులు భూమన్‌, రాయలసీమ మేథావుల ఫోరం నాయకులు ఎం.పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త కత్తి మహేష్‌, టిటిడి ఉద్యోగ సంఘాల పూర్వ నాయకులు రెడ్డివారి ప్రభాకర్‌ రెడ్డి, మునిరెడ్డి, దాసు, సీమ నాయకులు నవీన్‌ కుమార్‌ రెడ్డి, అశోక్‌, సీనియర్‌ జర్నలిస్టులు శంకయ్య, రాఘవశర్మ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*