రాష్ట్ర ఎన్నికల‌ సంఘానికి… పరిధులు, పరిమితులు ఉన్నాయి..! రమేష్ కుమార్ తెలియదా..!!

కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నంత అపరిమిత అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేవు. రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘాలకు చాలా పరిధులు, పరిమితులు ఉంటాయి. తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఉండవు.

దేశ వ్యాపితంగా గానీ, ఒక రాష్ట్రంలోగానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అంటే…. రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగేటప్పుడు ఆయా ప్రభుత్వాలు నామమాత్రపు ప్రభుత్వాలుగానే ఉంటాయి. అంటే సాధారణ పరిపాలన తప్ప… కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అక్కడి ప్రభుత్వానికి‌ అన్ని అధికారాలూ ఉంటాయి.‌

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేస్తుంది. ప్రభుత్వాల గడువు ముగియడానికి మునుపే ఎన్నికల‌ సంఘం ఎన్నికల ప్రక్రియ చేయడుతుంది. దీనికి ప్రభుత్వాల అనుమతిగానీ, ఆమోదంగానీ అవసరం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించేది రాష్ట్ర ఎన్నికల సంఘం కాదు. రాష్ట్ర ప్రభుత్వమే. ఎన్నికల‌ తేదీలనూ నిర్ణయించి ఎన్నికల సంఘానికి‌ ఇస్తుంది. దాని ప్రకారం అది ఎన్నికల ప్రక్రియను చేపడుతుంది.

ఎన్నికైన స్థానిక ప్రభుత్వాల గడువు ముగియగానే ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు. ప్రభుత్వం చెప్పేదాకా ఎన్నికల సంఘం మౌనంగా ఉండాల్సిందే.

2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఇప్పటిదాకా వాయిదా వేసింది ఎన్నికల‌ సంఘం కాదు.‌ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం కాదు. జగన్ ప్రభుత్వం మాత్రమే.

ఎన్నికలు నిర్వహించమని ప్రభుత్వం అప్పగించిన పనిని పూర్తి చేయడమే రాష్ట్ర ఎన్నికల సంఘం పని. రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్ పదవికి మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే గవర్నర్ ఒకరిని ఎంపికచేసి నియమిస్తారు.

మొత్తంగా చూసినపుడు రాష్ట్ర ఎన్నికల అధికారికి పరిమితమైన అధికారాలే ఉన్నాయి.‌ కేంద్ర ఎన్నికల‌ సంఘం లాగా విశేష అధికారాలు లేవు.

1 Comment

  1. దేశ ఎన్నికలు అంటే రాజ్యాంగాన్ని కాపాడి దేశములో ప్రజాస్వామ్యం ని కాపాడే బాధ్యత.కాబట్టి ఎన్నికలు కోడ్ వచ్చిన నాటినుండి దేశాన్ని ,రాష్ట్రానికి ఎన్నికలు కమీషన్ రాజు.ఆయన చెప్పినట్లే నడవాలి.లేదంటే మన రాజకీయ నాయకులు దేశం లో ప్రజాస్వామ్యం ఉంచరు సర్.

Leave a Reply

Your email address will not be published.


*