రాహూల్‌ గాంధీకి ఫోన్‌ చేసిన ప్రధాని మోడీ

చైనా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి ఫోన్‌చేసి ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారట. కాంగ్రెస్‌ పార్టీనే ఈ విషయాన్ని వెల్లడించింది. కర్నాకట ఎన్నికల్లో హోరాహోరీ తలపుడున్న తరుణంలో రాహుల్‌కి నరేంద్రమోడీ ఫోన్‌ చేయడం ఏమిటి? ఎందుకోసం చేశారు?

కర్నాటక ఎన్నికల్లో ప్రచారం కోసం రాహుల్‌ గాంధీ విమానంలో బయలుదేరారు. అయితే ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అత్యవసరంగా నేలమీదకు దించడానికి మూడుసార్లు ప్రయత్నించిన ఫైలెట్‌…మూడో ప్రయత్నంలో అతికష్టం మీద దించారట. ఫైలెట్‌ ప్రయత్నాలు సఫలం కాకుంటే ఘోర ప్రమాదం జరిగేది. ఈ విషయం తెలిసిన ప్రధాని…రాహుల్‌కి ఫోన్‌చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారట.

ఇక ఈ విమాన ఘటనకు సంబంధించి కుట్ర దాగివుందన్న అనుమానాలను కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తం చేస్తోంది. మానవ రహిత పైలెట్‌ వ్యవస్థ పని చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది అసాధారణమని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కర్నాటక డిజిపికి కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని విమానయాన శాఖ ఏర్పాటు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*