రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూప్రసాదం విక్రయం

తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని టిటిడి రికార్డు స్థాయిలో తయారుచేసి భక్తులకు విక్రయించింది. తమిళులకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసంలో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసి అందుబాటులో ఉంచుతోంది.

ఈ క్రమంలో సెప్టెంబరు 30వ తేదీ ఆదివారం టిటిడి చరిత్రలో మొదటిసారి 5,13,566 లడ్డూలను తయారుచేసి భక్తులకు విక్రయించడం జరిగింది. గతంలో 2016 అక్టోబరు 10న 4,64,152 లడ్డూలు, 2017 మే 28న 4,32,745 లడ్డూలు, 2018 మే 19న 4,14,987 లడ్డూలు, 2017 జూన్‌ 11న 4,11,943 లడ్డూలను టిటిడి విక్రయించింది. పోటు విభాగం అధికారులు, సిబ్బంది, పోటు కార్మికులు సమష్టిగా కృషి చేసి భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను తయారుచేస్తున్నారు. తయారుచేసిన లడ్డూలను 64 కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*