రెండో వికెట్ నూత‌న్ నాయుడు! స‌ర‌దా స‌ర‌దాగా సండే!

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం నూతన్ నాయుడు బయటకు వెళ్లిపోయారు. కౌసల్ వెళ్లొపోతారని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా నూతన్ ఎలిమినేట్ అయ్యారు. కౌసల్ అమ్మాయిలపై చేతులేసి మాట్లాడుతు న్నారంటూ దీప్తి సునయన, మరో ఇద్దరు సభ్యులు బిగ్ బాస్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రేక్షకుల్లో అతనిపై చెడు అభిప్రాయం ఏర్పడింది. కచ్చితంగా అతనికి వ్యతిరేకంగా ఓట్లు పడివుంటాయి. కౌసల్ వెళ్లిలోవడం ఖాయం అనే అంచనాలు వచ్చాయి. అయితే తను దురుద్దేశంతో ఎవరినీ తాకలేదని, షోలో భాగంగానే అలా చేశానని కౌసల్ అందరికీ వివరణ ఇచ్చారు. సునయనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా పట్టించు కోకుండా కిరీటి మళ్లీ మళ్లీ అదే ఆరోపణతో కౌసల్ ను బ్లేమ్ చేయడం, దీంతో తన నైతిక ప్రవర్తనకు మాయని మచ్చగా భావించి తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలోనే కిరీటితో తీవ్రస్థాతయిలో గొడవపడ్డాడు.ఈ ఎపిషోడ్ తరువాత కౌసల్ నిజాయితీని ప్రేక్షకులు గుర్తించారు. ఓట్లు కూడా పెరిగిపోయాయి. ఇదే విషయాన్ని నానీ కూడా చెప్పారు. నూతన్ నాయుడు మొదటి నుంచి నాటకీయంగా ప్రవర్తిస్తున్నారన్న భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇది ఎవరికీ నచ్చలేదు. మొదటి వారమే ఆయన ఎలిమినేట్ అవుతారని అంచనా వేశారు. ఆ వారం సంజన బయటకు వచ్చేశారు.

రెండో ఆదివారం ఎపిషోడ్ సరదా సరదాగా సాగింది. శనివారం మొత్తం సీరియస్ గా ఉన్న నాని ఆదివారం మాత్రం నవ్వుతూ, హజ్ మేట్స్ ను నవ్విస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఎపిషోడ్ నడిపించారు. ప్రతి సభ్యుడూ తనకు బాగా నచ్చిన ఇంకో హౌజ్ మేట్ కి మార్కులు ఇవ్వమని బిగ్ బాస్ అడిగారు. వచ్చిన మార్కులను బట్టి సభ్యులతో సరదా పనులు చేయించారు. నూతన్ తో చపాతీలు చేయిస్తే రోల్ రైడాతో కప్ప గంతులు వేయించారు. గణేష్ ను కుప్పి గంతులు..ఫల్టీ వేయమంటే ఒకటి కూడా చేయలేకపోయారు. ఆఖరికి డాన్స్ చేయించారు. తనిష్, సామ్రాట్ తో ఒంగుడు…దూకుడు ఆట ఆడించారు. ఒకరితో పచ్చి మిరప బజ్జీలు తినిపించారు. ఇంకో ఇద్దరితో చక్కర నీళ్లు కలపని నిమ్మరసం గ్లాసుల కొద్దీ తాగించారు. ఒకరితో బిస్కెట్లు, ఇంకొకరితో స్వీట్లు తినిపించారు. ముగ్గురితో ఆరేసి పచ్చి కోడిగుడ్లు తాగించారు. బాబు గోగినేనికి మాత్రం ముద్దులు పెట్టుకునే చెప్పగా ఆయన కిరీటి చేతిపైన ముద్దులు పెట్డారు. ఇలా ఎపిషోడ్ మొత్తం సరదాగా సాగింది.

సభ్యులెవరూ నిరుత్సాహ పడకూడదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలనే ధోరణితోకాకుండా, ఇంట్లోనే ఉండి గెలవాలన్న పట్టుదలతో ఆడాలంటూ అందరిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*