రేపు టిటిడి‌ బోర్డు సమావేశం…బంగారు వివాదానికి క్లీన్ చిట్..!

ప్రభుత్వం మారిన నేపథ్యంలో అన్ని నామినేటెడ్ సంస్థల ఛైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తుండగా…. టిటిడి పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా హాడావుడిగా సమావేశం నిర్వహించేందుకు తహతహలాడుతోంది.

28.05.2019న తిరుమలలో బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఇటీవల ఎన్నికల సందర్భంగా తలెత్తిన బంగారు వివాదంలో టిటిడి అధికారులకు క్లీన్ చిట్ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఎన్నికల సమయంలో చెన్నై నుంచి 1381 కిలోల బంగారు తరలిస్తుండగా ఎన్నికల అధుకారులు పట్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం సీనియర్ ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన తన నివేదికను సిఎస్ కు ఇచ్చారు. అయితే ఆ నివేదికను ఇప్పటిదాకా బయట పెట్టలేదు. ఈ వివాదంలో కొందరు అధికారుల తీరును తప్పుపట్టినట్లు సమాచారం. అయితే…రేపు జరగనున్న సమావేశంలో అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అదే విధంగా కొన్ని కాంట్రాక్టులును ఫైనలైజ్ చేసుకోనిన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక నియామకాల పేరుతో పది మంది ఉద్యోగుల నియామకం అజెండా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ఓ బోర్డు మెంబర్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో ఇంత హడావుడిగా బోర్డు సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్న. నిబంధనల మేరకు నిర్వహించాల్సివుంటే…సాంకేతికంగా నిర్వహించవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ…ఇందుకు భిన్నంగా తతంగం సాగుతోంది. ఈ అంశంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*