రేపు టిటిడి బ్యాంకు అధ్యక్షులు, ఉపాధ్యకులు ఎవరు..!

టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ ఎన్నికల లెక్కింపు కొనసాగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసింది. తిరుపతి ఎస్ జి ఎస్ హై స్కూల్, తిరుమల ఎస్వి హై స్కూల్ లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ అనంతరం తిరుమల నుంచి బ్యాలెట్ బాక్సులను తిరుపతికి తీసుకొచ్చారు. ఎస్ జి ఎస్ హైస్కూల్లో కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు మొదలైంది. మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశారు. మొదటి రౌండ్ ఫలితాలు గురువారం రాత్రి 10 గంటల యాభై నిమిషాలకు వెల్లడయ్యాయి. రెండో రౌండ్ ఫలితాలు వచ్చేసరికి అర్ధరాత్రి రెండున్నర గంటలు అయింది. తుది, మూడవ రౌండు ఫలితాలు శుక్రవారం వారు జామున నాలుగున్నర గంటలకు వెల్లడయ్యాయి. ఐదు గంటలకు విజేతలకు డిక్లరేషన్ పత్రాలను ఎన్నికల అధికారి బ్రహ్మానంద రెడ్డి అందజేశారు.

మొత్తం 6,860 ఓట్లకు గాను 5531 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 224 ఓట్లు చెల్లకుండా పోయాయి. 5307 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మొత్తం 7 పోస్టులకుగాను 24 మంది పోటీ పడ్డారు. 2922 ఓట్లతో గోల్కొండ వెంకటేశం మొదటి స్థానంలో నిలిచారు. 2848 ఓట్లతో చీర్ల కిరణ్ రెండో స్థానాన్ని, 2493 ఓట్లతో ముని వెంకటరెడ్డి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2337 ఓట్లతో వాసు నాలుగో స్థానంలోను, 1956 ఓట్లతో గుణశేఖర్ ఐదవ స్థానాన్ని, 1810 ఓట్లతో చింతల శివకుమార్ ఆరో స్థానాన్ని, 1805 ఓట్లతో బచ్చల హేమలత ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ వచ్చిన వారి వివరాలు చూస్తే…1500 ఓట్లతో మహేష్, 1221 ఓట్లతో దిండుపాటి కుమారస్వామి, 1106 ఓట్లతో లోకనాథం, 1069 ఓట్లతో ఎల్ ఎన్ వి రవి కుమార్ ఉన్నారు.

సి ఐ టి యు తరుపున పోటీచేసిన వెంకటేశం, గుణశేఖర్ ఇద్దరూ గెలుపొందారు. ఏకైక మహిళగా బరిలోకి దిగిన హేమలత అందరూ ఊహించినట్లుగానే విజయం సాధించారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు పోటీ చేయగా ముని వెంకటరెడ్డి, గెలుపొందారు. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నుంచి బరిలోకి దిగిన మహేష్, భాస్కర్ లలో ఒకరు కూడా విజయం సాధించలేకపోయారు. ఒంటరిగానే ఎన్నికల పోరాటం ప్రారంభించిన చీర్ల కిరణ్, ముని వెంకటరెడ్డి, శివ కుమార్ ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు గా ఉన్న ఆడసలపల్లి వాసు గెలుపు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగినది.

ఇదిలావుండగా ఎన్నికైన ఏడుగురు డైరెక్టర్లు తమలో తాము బ్యాంకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి కలసి ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియ శనివారం నిర్వహిస్తామని ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఈ ఎన్నిక కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించి అవసరమైతే ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గతంలో టీటీడీ ఈవో నే అధ్యక్షుడిగా ఉండేవారు. ఎన్నికైన డైరెక్టర్లు ఉపాధ్యక్షులు ని, కోశాధికారి ని ఎన్నుకునే వారు. ఈసారి ఈవో అధ్యక్షునిగా ఉండడానికి నిరాకరించడంతో… అధ్యక్షుడు కూడా డైరెక్టర్ల నుంచే ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకు అధ్యక్ష ఉపాధ్యక్షులు గా ఎన్నికవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*