రోల్ రైడా అవుట్…బిగ్ బాస్ వేదికపై నాగార్జున !

అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ ఇంటి నుంచి రోల్ రైడా బయటకు వచ్చేశారు. ‌ఫైనల్స్ లో ఐదుగురు మిగిలారు. సామ్రాట్, కౌశల్, గీత, దీప్తి, తనిష్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల‌ 30 న ఫైనల్ ఫలితాలు రానున్నాయి. ‌ఆరోజు జరిగే ఎపిషోడ్ లో విజేతను ప్రకటించనున్నారు. చివరి ఎలిమినేషన్ గా రోల్ ను బయటకు పంపించారు. ఈ వారం రోల్ వెళతారని అందరూ ముందే ఊహించారు. ఈ వారం ఇంటిలో మిగిలిన‌ ఐదుగురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు బిగ్ బాస్ సీజన్ 2 విజేత అవుతారు.‌‌

ఈ ఆదివారం నాటి ఎపిషోడ్ కు నాగార్జున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.‌‌ నాని , నాగార్జున కలిసి నటించిన దేవదాస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. సినిమా ట్రైలర్ చూపించారు. ఇప్పుటికే 106 రోజులుగా ఇంట్లో ఉన్న వారిని చూసి నాగార్జున ఆశ్చర్యపోయారు. తాను ఒక్క రోజు కూడా ఉండేవాడిని కాదని అన్నారు. దేవదాస్ సినిమా హీరోయిన్లు కూడా వేదికపై కి వచ్చి బిగ్ బాస్ ఇంటి సభ్యులను పలకరించారు.

ఇంట్లో మిగిలిన ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్ విజేత అవుతారనెరది ఆసక్తికరంగా మారింది.‌ కౌశల్, గీత ఇద్దరిలో ఒకరు టైటిల్ గెలవవచ్చని ప్రేక్షకులు అంచనావేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*