లాజిక్కు లాగిన ఉండవల్లి

అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటాపోటీగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ ఉద్యమం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ లాజిక్కు లాగారు. అసలు ప్రత్యేక హోదా ఎలా తెస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో వైసిపిగానీ, తెలుగుదేశంగానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్‌గానీ, బిజెపిగానీ, మూడో కూటమిగానీ అధికారం చేపడుతుంది. తాము ప్రభుత్వంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌ బద్ధ శత్రువు. ఇక వైసిపి…తాము కాంగ్రెస్‌ను నమ్మబోమని అంటోంది. బిజెపినే ఇస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఇవ్వని బిజెపి ఎన్నికల తరువాత ఎలా ఇస్తుంది? ఇక మూడో కూటమి వంటిది అధికారరలోకి వచ్చినా…ప్రాంతీయ పార్టీలతో కూడుకున్నది కాబట్టి….ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీహార్‌ వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం చాలా రోజులుగా అడుగుతున్నాయి.’ ఇదీ ఆయన లేవనెత్తుతున్న పాయింటు. దీనికి టిడిపి, వైసిపి ఎలా స్పందిస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*