వచ్చే ఎన్నికల్లో మహేష్‌ బాబు ప్రచారం చేయరట…ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నటీలు కూడా రాజకీయ పార్టీల వారీగా విడిపోయి, ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్లు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసింది. ఈసారి కూడా తెలుగుదేశం తరపున కొందరు, వైసిపి తరపున కొందరు, పవన్‌ తరపున కొందరు నటులు ప్రచారం చేయనున్నారు. అయితే…స్టార్‌హీరోగా పేరున్న ప్రిన్స్‌ మహేష్‌ బాబు 2019 ఎన్నికల్లో ఎవరి తరపునా ప్రచారం చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ సమయంలో తాను విదేశాల్లో షూటింగ్‌లోనో, హాలిడే ట్రిప్‌లోనే ఉంటానని విలేకరులకు చెప్పారు.

2014 ఎన్నికల్లో మహేష్‌ బాబు తెలుగదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. అదీ తన బావ గల్లా జయదేవ్‌ పోటీ ఎంపిగా పోటీ చేసిన గుంటూరు నియోజకర్గానికే పరిమితం అయ్యారు. ఈసారి ఆ పరిమితుల్లోనూ ప్రచారం చేసే సూచనలు కనిపంచడం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇటీవల గల్లా జయదేవ్‌ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసాని ఎన్నికల్లో మహేష్‌ బాబు సహకారం తీసుకోబోనని చెప్పారు. ఎందుకంటే….గత ఎన్నికల్లో మహేష్‌ ప్రచారం చయడం వల్లే జయదేవ్‌ గెలిచారన్న ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం ఇష్టం లేక జయదేవ్‌ ఆ మాట చెప్పారు. నియోజకవర్గ ప్రజలపై తాను ప్రభావం చూపించగలిగానని, అదే తనను గెలిపిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయబోనని మహేష్‌ చెప్పడం వెనుక ఇదీ ఒక కారణమైవుండొచ్చు. ప్రస్తుతం మహేష్‌ బావ గల్లా జయదేవ్‌ టిడిపిలో ఉన్నారు. గల్లా తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా టిడిపిలోనే ఉంటున్నారు. అయితే అరుణ కుమారి పార్టీ మారుతారన్న ప్రచారం సాగుతోంది. ఇందువల్ల కూడా మహేష్‌ అలా చెప్పివుండే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*