వరుణదేవుడు టిడిపి అభిమానా…వ్యతిరేకా?

ఇది ఆసక్తికరమైన వార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకో, కార్యకర్తలకో చెప్పినట్లు వరుణ దేవునికీ అభినంనదనలు తెలియజేశారు. దేవుళ్ల వల్ల మేలు జరిగితే…కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. చంద్రబాబు మాత్రం అభినందించారు. ఇంతకీ విషయం ఏమంటే….తిరుపతిలో ఈనెల 30న ధర్మపోరాట దీక్షను టిడిపి నిర్వహించింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక సాయంత్రం 4.30 గంటల సమయంలో గాలితో కూడిన వర్షం కురింది. వేదిక చిందరవందర అయింది. సభలో కూర్చీలన్నీ నెలకొరిగాయి. సభ జరుగుతుంతో లేదో అనే ఆందోళన కలిగింది. అయితే కొంతసేపటికి వర్షం తగ్గడంతో హడావుడిగా మళ్లీ ఏర్పాట్లు చేశారు. దీన్ని సాక్షి మీడియాలో వరుణ దేవుడి ఆగ్రహం అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌లు వేశారు. అయితే సభ ముగింపులో చంద్రబాబు వర్షం ప్రస్తావన తెచ్చారు. మన సభకు వరుణ దేవుడు కూడా సహకరించాడు. వాన కురిపించి వాతావరణాన్ని చల్లగా మార్చాడు. ఇది శుభ సూచకం. ఇందుకు వరుణ దేవున్ని అభినందిస్తున్నాను..అని అన్నారు. కృతజ్ఞతలు అనాల్సింది…అభినందిస్తున్నాను అని అన్నారు.

ఇంతకీ సభ ప్రారంభానికి ముందు గాలివాన గందరగోళం సృష్టించడాన్ని బట్టి…వరుణదేవుడు టిడిపి వ్యతిరేకి అనుకోవాలా? చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వాతావరణం చల్లబడటం వల్ల వరుణుడు టిడిపి అభిమాని అనుకోవాలా? టిడిపి అనుకూలరు వరుణుడు తమ పార్టీ అభిమాని అని చెప్పుకుంటే…వ్యతిరేకులు వరుణుడూ టిడిపికి వ్యతిరేకం అయ్యాడు అని బాష్యం చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన టిడిపి అభిమానో, వ్యతిరేకో వరుణదేవుడే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*