వాట్సాప్ దెబ్బతో జెట్ విమానం బెంబేలు!

వాట్సాప్ వచ్చిన తరువాత ఏ వార్తయినా క్షణాల్లో లక్షల మందికి చేరిపోతోంది. ఆ వార్తలో నిజమెంతో అబద్ధమెంతో కూడా లేల్చుకోలేని పరిస్థితి. రెండు రోజులుగా జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు సంబంధించి ఒక అసత్య వార్త వాట్సాప్ లో వైరల్ అవుతోంది. ఈ సంస్థ 25 వార్షికోత్సవము సందర్భంగా రెండు టిక్కెట్లు ఉచితంగా ఇస్తోందని, అయితే ఉచిత విమాన టికెట్లకు సంబంధించిన సమాచారాన్ని మరో 20 మందికి షేర్‌ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ప్రచారం జరుగుతోంది. బాగా చదువుకున్నవారు కూడా ఈ మెసేజ్ ను తన సెల్ లోని ఇతర గ్రూపులకు పంపుతున్నారు. తరచూ ఆ విమానాల్లో ప్రయాణించే వారు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో హైరానాపడిన జట్ సంస్థ యాజమాన్యం స్పందించింది. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎటువంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించలేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలను నమ్మొద్దని కోరింది. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్‌వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్‌ మార్క్‌ ఉంటుంది అని తన ట్విటర్ ఖాతా ద్వారా వినియోగదారులకు వెల్లడించింది. జెట్ విమానం కంటే వాట్సాప్ ఎంత వేగంగా ఉందో చూసి ఆ సంస్థ ఆశ్చర్యపోయి ఉంటుంది. ముందూవెనుక ఆలోచించకుండా ఇలాంటి మెసేజ్ లు ఫార్వర్డ్ చేయొద్దు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*