వాహనాల నెంబర్ స్టిక్కర్లు పిచ్చిపిచ్చిగా వేసుకుంటే పోలీసుల చేతిలో బుక్ అయిపోతారు…నెంబర్లు ఎలా చేయాలో తెలుసుకోండి..!

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ‌.రమేశ్ రెడ్డి, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి.యస్.పి 1 మల్లికార్జున, ట్రాఫిక్ డి‌.ఎస్‌.పి-2 ఇస్మాయిల్, ట్రాఫిక్ సి.ఐ సురేశ్ కుమార్, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి శనివారం (13-06-2020) సాయంత్రం తిరుపతి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలో… నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రింద అంశాల మీద అవగాహన కల్పించారు.

 • వాహనదారుడి కోరిక మేరకు నెంబర్ ప్లేట్ పైన ఏలాంటి పేరును,బొమ్మలను మరియు ఫోటోలను స్టిక్కరింగ్ చేయరాదు.
 • ఫ్యాన్సీ అక్షరాలను వివిధ ఆకృతులతో వాహన నెంబర్ ప్లేట్ పై స్టిక్కరింగ్ చేయరాదు.*
 • వివిధ శాఖలకు సంబందించిన గుర్తింపు స్టిక్కర్లు, పేరును (ఉదాహరణకు… ప్రెస్,పోలీసు,ఫైర్.. మొదలైనవి) ప్రైవేట్ వాహనాలకు స్టీక్కరింగ్ చేయరాదు.
 • RTO వారు సూచించన విధముగా ప్రైవేట్ వాహనాలకు నిర్ణీత కొలతలతో ఉన్న తెలుపురంగు బోర్డు పైన మరియు కమర్షియల్ వాహనాలకు సంబందించి పసుపు రంగు బోర్డు పైన మాత్రమే నిర్ణీత కొలతలతో ఉన్న నలుపూ అక్షరాలను స్టిక్కరింగ్ చేయవలెను.

నెంబర్ ప్లేట్ సైజ్ లు

 1. ద్వాచక్ర మరియు మూడు చక్ర వాహనాలకు : 200 x 100 mm
 2. నాలుగు చక్ర వాహనాలకు: 340x 200 mm or 500 x 120 mm
 3. పెద్ద వాహనాలకు : 340 x 200 mm
 4. RTO వారు సూచించిన విధముగా అన్నీ అక్షరాలు తప్పనిసరిగా ఇంగ్లిష్ అక్షరాలు మరియు నెంబర్ లతో మాత్రమే స్టిక్కరింగ్ చేయవలెను. ఉదాహరణకు(ద్విచక్ర వాహనాలకు) : వాహనానికి ముందు వైపు*
  *AP28 A 2345…వాహనానికి వెనుక వైపు
  *AP28*
  A 2345 ఉండాలి
 5. RTO వారు జారీ చేసిన హై సెక్యూరిటి రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP)లనేవాడవలెను.
 6. వాహనదారులను కోరడమేమనగా వారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే నెంబర్ ప్లేట్ వారి వాహనాలకు కలిగిఉండవలెను.‌నెంబర్ ప్లేట్ పై ఏలాంటి పేర్లు గాఈ , చిహ్నాలు గాని, చిత్రాలు గాని ఉండరాదు. అలా కలిగిఉన్న వాహనాదారులకు భారీ జరిమానా విధించి చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*