విలేకరులు గలీజు మనుషులు, బుర్రలేనోళ్లు…అయినా ట్రంప్‌కు అంత భయమెందుకో..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. ఆయన ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారో, ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ అర్థంకాదు. పాత్రికేయులతోనూ తరచూ అసహం ప్రదర్శిస్తుంటారు. వైట్‌ హౌస్‌లోకి రాకూడంటూ నిషేదాజ్ఞలు విధిస్తుంటారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంతో చర్చనీయాంశమయ్యారు ట్రంప్‌ మహాశయుడు.

పారిస్‌లో జరిగే అంతర్జాతీయ నేతల సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతున్న ముందు సిఎన్‌ఎన్‌ విలేకరి అడిగిన ఓ ప్రశ్నతో ట్రంప్‌కు చిర్రెత్తింది. ‘నిన్ను చాలాసార్లు చూశాను. బుర్రతక్కువ ప్రశ్నలు అడిగావు. ఇప్పుడు నువ్వు అడిగింది ఎంత బుర్రతక్కువ ప్రశ్న’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు.

ట్రంప్‌ విలేకరులతో ఈ విధంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి ఏదో ప్రశ్న అడిగినందుకు…ఆయన వద్ద నుంచి మైక్‌ లాక్కున్నారు. ఆ విలేకరి ఇకపై శ్వేతసౌధంలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించారు. ఇంకో విలేకరి గురించి ‘చాలా గలీజు మనిషి’ అంటూ అభ్యంతరకంగా మాట్లాడారు.

ఇదిలావుంటే…శ్వేతసౌధంలో విలేకరులుంటే తనకు చాలా భయంగా ఉంటుందన్నారు ట్రంప్‌. ఇది చాలా ప్రత్యేకమైన స్థలమని, దీన్ని అందరూ గౌరవించాలని హిత వచనాలు వళ్లించారు. అయినా…ట్రంప్‌ మాట ప్రకారం జర్నలిస్టులకు బుర్రలేదు. మరి బుర్రలేని జర్నలిస్టులంటే ట్రంప్‌గారికి అంత భయమెందుకో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*