విలేకరులూ…మీరు అనుకుంటున్నది తప్పు!

ఇది ప్రతి పాత్రికేయుడూ తెలుసుకోవాల్సిన వార్త. క్షేత్ర స్థాయిలో పని చేసేవాళ్లయినా, డెస్క్‌ల్లో పనిచేస్తున్న సబ్‌ఎడిటర్లు అయినా…కచ్చితంగా తెలుసుకోవాల్సిన వార్త. వృత్తి విలువలకు సంబంధించిన వార్త.

అత్యాచారం జరిగినపుడు బాధితుల పేర్లుగానీ, ఫొటోలుగానీ, వారిని గుర్తించడానికి వీలు కల్పించే ఎలాంటి వివరాలుగానీ ప్రచురించకూడదు. అదే అత్యాచారానికి గురైన బాధితురాలు మరణిస్తే….ఆమె ఫొటోలు వేసి కథనాలు ఇస్తున్నారు. ఇది ఇప్పటిదాకా పత్రికలు, టివిలు పాటిస్తున్న పద్ధతి. అయితే…బాధితురాలు మరణించినా కూడా…ఆమె పేరుగానీ, ఫొటోగానీ, ఆనవాళ్లుగానీ ప్రచురించకూడదు. ప్రసారం చేయకూడది. ఇది సుప్రీం కోర్టు చెబుతున్న మాట. కథువా ఘటనలో బాలిక పేరు, ఫొటో ప్రచురించడం, ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇలా చేసిన మీడియా సంస్థలకు జరినామానా కూడా విధించింది. ప్రస్తుతం ఈ అంశంపై లోతుగా విచారణ జరుపుతోంది. ‘మరణించిన వారికీ గౌరవ మర్యాదలుంటాయి’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మైనర్ల విషయంలో బాధితురాలి తల్లిదండ్రులు అంగీకరించినప్పటికీ….ఫొటోలు, పేర్లు వెల్లడించకూడదని పేర్కొంది. అయితే… అత్యాచారానికి సంబంధించి వివరాలే వెల్లడించకుండా మీడియాపై నిషేధం ఉండరాదని, మీడియా స్వేచ్ఛకు, బాధితుల గోప్యత హక్కుకు మధ్య సమతౌల్యం పాటించాలన్న వాదనలు ధర్మాసనం ముందుకు వచ్చాయి. లైంగిక నేరాలలో బాఙతుల పేర్ల వెల్లడిని నియంత్రించే భాతర శిక్షా స్మ ృతి (ఐపిసి) సెక్షన్‌ 228-ఎ గురించి జస్టిస్‌ మదన్‌ ఎంబి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సెక్షన్‌ ప్రకారం బాధితుల పేర్లను ఏ దశలోనూ వెల్లడించకూడదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*