విశాఖలో విషాదం…గ్యాస్ లీక్…ఏడుగురి మృతి…చాలా మందికి అస్వస్థత..!

కరోనాతో తల్లడిల్లుతున్న సమయంలోనే విశాఖపట్నంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవడంతో ఏడుగురు మరణించారు. పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం సమీపంలోని గోపాలపట్నం వద్దనున్న పాలిమర్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ చుట్టుపక్కల వ్యాపించింది. గ్యాస్ సోకిన వారు అక్కడిక్కడే పడిపోయారు. ఇందులో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయి. బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన విశాఖపట్నం వెళ్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*