విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి ఉదారాత..! కష్టకాలంలో పేదలకు సాయం..!

మాసిన‌ వస్త్రాలను శుభ్రపరిచి జీవనం సాగించే రజకులు, నేడు కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నావారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారి వేదనను చూసి చలించిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి అలగాని ఆనంద్ బాబు తనవంతు చేయూత‌ అందించారు. పదికేజీల బియ్యం, అర్ధ కిలో కందిపప్పు చొప్పున 200 మంది రజక కుటుంబాలకు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.

స్థానిక సుందరయ్యనగర్ సమీపంలోని ధోబీ ఘాట వద్దున్న వీరభద్రస్వామి గుడి వద్దకు వెళ్లి, చేతికి గ్లౌజ్ మొహానికి మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తన కుటుంబసభ్యులతో కలసి ప్రతి రజక కుటుంబానికి బియ్యం మూట, కందిపప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాలుగా తమ‌ సహచరులుగా జీవిస్తున్న రజకులు నేడు కరోనా వల్ల ఇబ్బందులు పడుతుండడం చూడలేక తనవంతు సహాయంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆ దేవదేవుడైన వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో కరోనా మహమ్మారి నుండి ప్రజలందరు త్వరలో రక్షింపబడతారని కాంక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి, మహేష్ బాబు, అంజన్ కుమార్, జ్యోతిబాబు, మంజుల, రాఘవేంద్ర, మల్లికార్జున, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*