వీర మోడీని ఆవు కుమ్మేసింది!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వీరునిగా, యోధునిగా అభివర్ణిస్తుంటారు ఆయన అభిమానులు. ఎంత వీరుడైనా ఎక్కడో ఒకచోట చతికలపడక తప్పదు. మన వీర మోడీ ఒక ఆవు ముందు బోర్లాపడ్డారు. ఆవు మోడీని కుమ్మిపారేసింది. ఆవు కుమ్మడమంటే ఆయన ఎక్కడైనా…జల్లికట్టులో పాల్గొన్నారని అనుకోవొద్దు. ఆవు నిజంగా కుమ్మలేదుగానీ…గోవధపై మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని అనివార్యంగా వెనక్కి తీసుకుంది. గోవులను కబేళాలకు విక్రయించకూడదని, గోవధ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రెచ్చిపోయిన మతఛాందసులు గోసంరక్షణ పేరుతో దాడులు చేశారు. కొందరి ప్రాణాలూ తీశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపైన దేశ వ్యాపితంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బిజెపి పాలనలోని గోవాలో సైతం పశుమాంస విక్రయాలను అడ్డుకోలేని పరిస్థితి. కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో ప్రజలు పశుమాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే గోవాలోగానీ, కేరళలోగానీ బిజెపి కార్యకర్తలు పశుమాంస విక్రయాలపై అడ్డుచెప్పలేకపోయారు. ప్రత్యేకించి దళితులు, ముస్లిం మైనారిటీల్లో బిజెపిపై చెప్పలేనంత వ్యతిరేకత వచ్చింది. ‘మేము ఏమి తినాలో కూడా మీరే చెబుతారా’ అని నిలదీశారు. గోవుతో రాజకీయంగా లాభపడదామనుకుంటే అంతా రివర్స్‌ అయింది. ఆ గోవే తమ పుట్టి ముందుతోందని అలస్యంగా తెలుసుకున్న బిజెపి….దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గోమాంసం విక్రయాలు, గోవధపైన ఆంక్షలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గోవులూ తిరగబడతాయన్న సత్యం బిజెపికి తెలిసొచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*