వెంకయ్య సభలో బాబు పేరెత్తితే ఒట్టు!

తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ టూరిజం మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో దాదాపు వంద కోట్లతో నిర్మించిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ …పాక శాస్త్ర ప్రావీణ్య శిక్షణా కేంద్రాన్ని ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు సోమవారం ప్రారంభించారు.‌ ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్పెన్స్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనకపోవడం గమనార్హం. బాబు విదేశాల్లో ఉన్న రోజు కార్యక్రమం పెట్టుకున్నారు.

విదేశీ పర్యటన కారణంగా బాబు రాలేకపోయారని అనుకున్నా…వేదికపై ఆయన పేరు కూడా ఎవరూ ఉచ్ఛరించలేదు.‌ ఆఖరికి భూమా అఖిల ప్రియ కూడా బాబు ప్రస్థావన తేలేదు. కేంద్ర మంత్రి, వెంకయ్య తన ఉపన్యాసం లో …ఈ సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు తప్ప…బాబు పేరు మాత్రం చెప్పలేదు. ఈ సంస్థ రావడానికి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య చేసిన కృషి ప్రధాన కారణమంటూ క్రెడిట్ మొత్తం వెంకయ్యకు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదిలావుండగా ఇటీవల విజయవాడలో కేంద్ర ప్రభుత్వ ఆకృతుల సంస్థను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి కూడా బాబు హాజరుకాలేదు. విశాఖలో మరో కార్యక్రమాన్ని బాబు పట్టుకున్నారు. తిరుపతి కార్యక్రమానికీ బాబు లేకపోవడం‌ గమనార్హం. వాస్తవంగస సోమవారం జరిగిన ప్రారంభోత్సవం ఇటీవలే జరగాల్సింది. వాజ్‌పేయి మరణంతో చివరి నిమిషంలో వాయిదాపడింది. ఆ రోజు బాబు అందుబాటులో ఉన్నా ఆయన పేరు ఆ కార్యక్రమం లో లేదు.

బిజెపి…టిడిపి మధ్య సంబంధాలు తెగిపోయిమ తరువాత ఆ రెండు పార్టీ లూ ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు.‌ అందుకే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు బాబు ముఖం చాటేస్తున్నారు.‌ బిజెపి కూడా ఆయన కోసం ఎదురుచూడటం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*