వెనక్కి తగ్గని వర్మ … పవన్‌కు సెటైరికల్‌ సమాధానం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తలెత్తిన వివాదంలో రాంగోపాల్‌ వర్మ వెనక్కి తగ్గడం లేదు. పవన్‌ను ‘మాదర్‌ చోద్‌’ అని అనమని శ్రీరెడ్డికి తానే చెప్పానని, అది తప్పయితే క్షమించమంటూ సారి చెప్పిన వర్మ….ఫిలిం ఛాంబర్‌ వేదికగా జరిగిన పరిణామాల నేపథ్యంలో మరోసారి పవన్‌కు సెటైరికల్‌ సమాధానం చెప్పారు. వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మెగా కుటుంబ సభ్యులంతా ఫిలిం ఛాంబర్‌లో ఉన్న సమయంలోనే వర్మ…మరోసారి ట్విట్టర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే టివిల్లో పవన్‌ అభిమానులు పలువురు వర్మను దూషించడం మొదలుపెట్టారు. దీంతో వర్మ తనదైన శైలిలో, కాస్త వెటకారం, వ్యంగ్యం మేళవించి పవన్‌ పేరుతో ఓ లేఖ రాశారు.

టివి 9 అధినేత శ్రీనురాజు, వర్మ, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ కలిసి తనపై కుట్ర చేశారని పవన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి వర్మ సమాధానం ఇస్తూ….’పవన్‌ కళ్యాణ్‌ గారు, నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు ..ఇప్పుడు మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్‌ చంద్రబాబు నాయుడి స్పెషల్‌ స్టేటస్‌ దీక్ష నుంచి డైవర్ట్‌ చెయ్యడానికి, భరత్‌ అనే నేను కలెక్షన్స్‌ తగ్గించడానికని నేనూ అనగలను. కానీ అనను. మీడియాలో మీటింగులకు బదులు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళమని శ్రీరెడ్డికి సలహా ఇఛ్చిన మీరు అదే పని ఎందుకు చేస్తున్నట్టు? అదలా ఉంచితే, అసలు ఏపి స్పెషల్‌ స్టేటస్‌ కంటే లీగలైజేషన్‌ ఆఫ్‌ ప్రాస్టిట్యూషన్‌ అనే టాపిక్‌ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్‌ స్టేటస్‌ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ కంటే ఎవరో ఆఫ్ట్రాల్‌ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు. నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు…మీరన్న దానికి పాయింట్లుగా నా వివరణ ఇస్తాను’ అని మొదటి పేరాలోనే లాజిక్కులతో సమాధానం చెప్పారు.

1.సురేష్‌ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్‌ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డి కి చెప్పాను. కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్‌ చేసిన వీడియోలోచాలా క్లియర్‌ గా వుంది
2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్‌ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్‌ గురించి తెలపటానికి
3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం. మహేష్‌ కత్తి ఉదాహరణ ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను.ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో ఇన్వెస్టిగేషన్‌ చేసి బయటకి తియ్యలేదు. ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను
4.ఇకపోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది కరక్ట్‌ కాదు. ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడం. అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్‌ మధ్యలో కూడా వాడే పదం. అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే ల…కొడుకు అనే పదం.
5. మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్‌ మీడియాలో మీ ఫాన్స్‌ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు
6. ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి 5 కోట్లు ఇచ్చి తిట్టించాననుకుందాం. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది! మీ అంత సూపర్‌ స్టార్‌ లీడర్‌ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా? మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా? మీ కొచ్చే ఓట్లు తగ్గిపోతాయా?
7. ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లగల వారెవరూ లేరు..ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్లీ క్షమాపణ చెప్పుకుంటున్నాను

పవన్‌ ట్విట్‌ : ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది ”నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు.’

వర్మ సమాధానం : కళ్యాణ్‌ గారు, హీరో అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు ..మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్‌ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు..ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*