వేలాది మంది మరణించిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి తెలుసా..?!

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 1984 లో జరిగిన ఓ గ్యాస్ లీక్ దుర్ఘటనలో వేలాది మంది మరణించారు. లక్షల మంది దాని ప్రభావానికి గురయ్యారు. భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్లో 1984 డిసెంబరు 2 అర్థరాత్రి వేళ ప్రమాదం జరిగింది.  మిథైల్ ఐసోసనియేట్ – ఎంఐసి అనే విష వాయువు లీక్ అయింది. ఇది ఐదు లక్షల మందిపైగా ప్రభావం చూపింది. మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది అప్పటికప్పుడే మరణించారు. 2006 సంవత్సరంలో ప్రభుత్వం దాఖలు చేసిన ఒక అఫిడవిట్లో గ్యాస్ లీకేజి వలన 5,58,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో 38,478 తాత్కాలిక ప్రభావానికి, 3,900 శాశ్వత ప్రభావానికి గురైనారు. అంతేగాక, ప్రమాదం జరిగిన రెండు వారాలలో 8,000 మంది మరణించారని, ఆ తరువాత గ్యాస్ సంబంధిత వ్యాధుల కారణంగా మరో 8,000 పైగా మరణించారని పేర్కొన్నారు. మొత్తంగా 16 వేల మందికిపైగా మరణించారని అంచనా. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో అందరూ భోపాల్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే…విశాఖ ఘటన భోపాల్ అంతటి విషాదం కాదని, దాంతో పోల్చాల్చిన అవసరం లేదని పలువురు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*