వైఎస్ రాజారెడ్డి హత్య రోజు కడప వార్త దినపత్రికలో ఏం జరిగింది…అలిపిరి ఘటన రోజు ఏం చేశాం…!

  • దీర్ఘకాలం ఎడిషన్ ఇన్ ఛార్జిగా పని చేసిన నజీర్ అనుభవాలు

ఎక్ట్రానిక్‌ మీడియా దూసుకొస్తున్న సమయంలో ప్రింట్‌ మీడియా పని అయిపోయిందని కొందరు అభిప్రాయపడ్డారు. మరి కొందరు క్షణంలో మాయమయ్యే దృశ్య మాధ్యమానికి ఉన్న పరిమితులను ప్రస్తావిస్తూ పత్రికలకు డోకా లేదని భరోసా ఇచ్చారు. కానీ న్యూస్‌ ఛానళ్ల ప్రభావం పత్రికా రంగంపై ఏమీ లేదా అంటే, అసలు ప్రభావం లేనే లేదని చెప్పడం సత్యదూరం అవుతుంది. ఎక్ట్రానిక్‌ మీడియా దూకుడు కు దీటుగా పత్రికలు తమ పని విధానాన్ని మార్చుకోవడమేగాక మరింత వేగాన్ని అందుకున్నాయి. మరుసరిటి రోజు అదే వార్తను అదనపు సమాచారంతో ఇవ్వడానికి కాలంతో పోటీపడుతున్నాయి. ప్రస్తుతం దినపత్రికలు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పడు వెబ్‌ ప్రపంచం ఒకటి నేనున్నానంటూ ఉరకలేస్తోంది. సరిగ్గా ఎక్ట్రానిక్‌ మీడియా ప్రవేశించినపుడు వేసుకున్న ప్రశ్నే మళ్లీ ఉత్పన్నమవుతోంది. అయితే అప్పుడు ఒక వార్తాపత్రికా రంగానికే ఈ సవాలు ఎదురయింది. ఇప్పుడు వెబ్‌ న్యూస్‌ ఇటు పత్రికా రంగానికి, ఎక్ట్రానిక్‌ మీడియాకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందంటున్నారు.

అప్పుడు అన్నీ అబ్బురమే

గతం…వర్తమానం…ఛాయామాత్రంగా తడమడం వెనుక ఉద్దేశం… అప్పుడు… ఇప్పుడు…ఎప్పుడైనా జర్నలిస్టు అనేవాడు నిత్య విద్యార్థియేనని చెప్పడానికే. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాయంలో ఎంఫిల్‌ మధ్యలో వదిలేసి 1989లో ఆంధ్రభూమిలో సబెడిటర్‌గా కెరీర్‌ మొదలు పెట్టినపుడు నాకు జర్నలిజంలో ఓనమాలు రావు. అక్కడ నాకు ప్రతిదీ అబ్బురంగా ఉండేది. జిల్లా కేంద్రం నుంచి టిపి (ఇంగ్లీషులో ఉండే తెలుగు)లో, మరికొన్ని వార్తలు (స్క్రిప్ట్‌) బస్సులో వచ్చేవి. అలాగే యుఎన్‌ఐ, పిటిఐ, రాయిటర్‌ తదితర వార్తా సంస్థల నుంచి ఇంగ్లీషులో వార్తలు వచ్చేవి. ఇంగ్లీషులో ఉన్న తెలుగును…తెలుగులో రాయడం, ఇంగ్లీషు వార్తను అనువదించడం ఉండేవి. ఆరితేరిన జర్నలిస్టుల మధ్య ట్రైనింగ్‌…తరువాత సబెడిటర్‌గా అవతారం. అప్పట్లో వార్తను ఎక్కువగా రీటైర్‌ చేసేవాళ్లం. నా ఆసక్తిని గుర్తించి ‘గుండె గొంతుకలో…’ అనే టాగ్‌తో  ప్రతి రోజూ సెంటర్‌ స్ప్రెడ్‌లో ఒక మానవీయ కథనాన్ని రాయించేవారు. రీటైర్‌ చేయడం వల్ల కథనానికి జీవం వస్తుంది. ఇప్పుడు రీటైర్‌ అనేది కొంతమేర తగ్గింది. పెరిగిన వేగం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. సరే…కడపలో ఎడిషన్‌ ప్రారంభిస్తుం డటంతో ఊరికి దగ్గరగా ఉంటుందని 1995 నవంబర్‌లో వార్తా దినపత్రికలో చేరాను. దాదాపు 15 ఏళ్లు కడప, తిరుపతిలో ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పని చేయడం అన్నది నా కెరీర్‌లో చాలా కీకమైనది. అంటే దాదాపు నా వృత్తి జీవితంలో ముప్పావు శాతం మఫిషియల్‌ డెస్క్‌లోనే గడిచింది.

ప్రతిరోజూ ఉద్విగ్నంగానే…
సబెడిటర్‌గా మీ అనుభవాలు రాయండని మిత్రులు అడిగినపుడు…ఏం రాయాలా? అని సందేహించాను. సరైన సమాచార వ్యవస్థలేని రోజుల నుంచి ప్రపంచంలో అరచేతిలో చూస్తున్న నేటి ఆధునిక కాలం వరకు ప్రతిరోజూ ఉద్విగ్నంగానే గడిపాను. ఎన్నో ప్రయోగాలు, ఇంకెన్నో పాఠాలు… తొలినాళ్లలో కొత్త టెక్నాజీతో వచ్చిన వార్త దినపత్రికలో అన్నీ కొత్తగానే ఉండేవి. ఆంధ్రభూమిలో గ్రిడ్‌, బ్రోమైడ్‌, రీటచ్చింగ్‌, కెమెరా…చూసిన నాకు, వార్తలో కంప్యూటర్‌లో పేజినేషన్‌, ఫొటో గెట్‌ చేయడం, డేటాలో న్యూస్‌, హైదరాబాద్‌ నుంచి పేజీలు రావడం….వింతేకదా! టెక్నాజీ ఎన్ని కొత్త పుంతు తొక్కినా… బేసిక్‌గా రిపోర్టర్‌, సబెడిటర్‌…పనిలో మాత్రం తేడా లేదు.

కడప ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు (అప్పుడు కడప నుంచే కర్నూలు, అనంతపురం ఎడిషన్లు కూడా ఇచ్చేవాళ్లం) అనేక సంచన వార్తలు వచ్చాయి. కడపలో ఒక ‘వార్త’ తప్ప ఏ పత్రికా ఎడిషన్‌ ప్రారంభించలేదు. దాంతో వార్తది కొంత పైచేయిగా ఉండేది. ఫ్యాక్షనిస్టులపైన, ఎన్నిక సమయంలో రిగ్గింగ్‌…బాంబు దాడు… బ్యాలెట్‌ పేపర్లు బయటకు రావడం… తదితర సంఘలను…ఇంకా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నాసిరకం పనులపై కథనాలు…వివాదాస్పందంగా మారిన పోలీస్‌ శాఖపై విమర్శనాత్మక కథనాలు చర్చకు దారితీశాయి. ఒక్కమాటలో చెప్పాంటే…ప్రతిరోజూ ఒక కథనమైనా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్లం. వృత్తిపరంగా ప్రూ చేసుకోవానే తపన అందుకు ఒక కారణం.

ఈవినింగ్‌ ఎడిషన్‌…టెన్షన్‌…
ఇవన్నీ ఒక ఎత్తయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి గారు (1998 మే 23) హత్యకు గురయినపుడు టెన్షన్‌ పడ్డాను. ఈవినింగ్‌ ఎడిషన్‌ తీసుకురావాలని హెడ్‌ఆఫీసు నుంచి తాకీదు. అప్పటికే జిల్లా బంద్‌ పాటిస్తున్నారు. రాకపోకలు లేవు. బ్యూరో ఇన్‌ఛార్జి ఘటనా స్థలానికి వెళ్లిపోయారు. వార్తలు ఎలా పంపిస్తారు? ఫొటోలు ఎలా వస్తాయి? అసలు ఇవన్నీ చేతికి ఎప్పుడు అందుతాయి? అప్పట్లో ఇప్పటిలా సెల్‌ఫోన్లు లేవు. అంతా అస్పష్టత. ఎడిషన్‌ ఇవ్వగమా లేదా అనే గుఋలు. అయితే ఆలోచిస్తూ కూర్చునే టైం కాదు. అప్పటికప్పుడు ఎడిషన్‌ కేంద్రంలో ఉన్న ఒకరిద్దరు రిపోర్టర్లతో రాజారెడ్డి బయోడేటా…పాత ఫొటోలతో రెండు మూడు వార్తలు రాయించుకుని పెట్టుకున్నాను. మధ్యాహ్నం దాటింది… ఘటనకు సంబంధించి ఒక వార్తగానీ, ఫొటోగానీ లేదు. ఇక ఈవినింగ్‌ ఎడిషన్‌ అసాధ్యమే అనుకున్నాం. ఆ పరిస్థితుల్లో బ్యూరో ఇన్‌ఛార్జి ఆఫీసుకు ఫోన్‌చేసి ఫొటోలు పంపినట్లు చెప్పడంతో ధైర్యం వచ్చింది. సాయంత్రం 3.30 గంట ప్రాంతంలో వార్త చేతికందింది. ఫొటోలు స్కానింగ్‌, వార్త కంపోజింగ్‌ పూర్తయింది. సంఘటనా స్థం, రాజారెడ్డి నిలువెత్తు ఫొటో….సూపర్‌లీడ్‌తో ఫస్ట్‌ పేజీ, మిగతా మూడు పేజీలు ఫైల్‌ఫొటోలు, బంద్‌ ఫొటోలు, సంతాపాలు, హత్యానంతర పరిస్థితి….తదితర వార్తలతో ఈవినింగ్‌ ఎడిషన్‌ రెడీ. ఎడిటర్‌ ఫోన్‌చేసి వేరీగుడ్‌ అన్నారు.

గ్రామీణ వార్త రాసిన విలేకరికి అవార్డు…
టాబ్‌లాయిడ్‌లో గ్రామీణ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మచ్చుకకు ఒకదాని గురించి….కడప జిల్లా ఓబువారిపల్లి మండల విలేకరి మారుమూల అటవీ ప్రాంతంలోని తిరుగుడుపల్లె అనే గ్రామం గురించి కథనం పంపారు. ఆ వార్తలో మొదటి పేజీలో ‘వెనక్కి వెనక్కి తిరుగుడుపల్లె,’ అనే శీర్షికతో బ్యానర్‌ చేశాను. అడవిని నమ్ముకుని జీవిస్తున్న అడవి బిడ్డలు వారు. కనీస వసతు లేవు. పొద్దున్నే ఈ కథనాన్ని చూసిన జిల్లా అధికారులు ఆ గ్రామానికి హుటాహుటిన వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని అప్పటికప్పుడు నిధులు మంజూరు చేశారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఈ వార్త రాసిన విలేకరికి ప్రభుత్వం ఉత్తమ విలేకరి అవార్డు ప్రకటించింది. మొదటి పేజీలో సగభాగం ఈ కథనానికే కేటాయించడం వల్ల అధికారయలు… సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే స్పందించారు. లోపలి పేజీల్లో సాదాసీదాగా ప్రచురించివుంటే ఇంత రియాక్షన్‌ ఉండేది కాదని నిస్పందేహంగా చెప్పవచ్చు. సబెడిటర్‌ ప్రతిభ వార్త జడ్జిమెంట్‌లోనే బయటపడుతుంది.

వృత్తిపరంగా ఛాలెంజ్‌…అలిపిరి ఘటన…
తిరుపతి ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నప్పడు వృత్తిపరంగా నేను బాగా టెన్షన్‌ పడిన సంఘటన….2003, అక్టోబర్‌ రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన దాడి…డ్యూటీకి వెళుతుండగా దారి మధ్యలో సాయంత్రం 4.30 గంటపుడు విషయం తెలిసింది. తేరుకోకముందే హెడ్‌ ఆఫీసు నుంచి ఫోన్ల మీద ఫోన్లు. ఈవినింగ్‌ ఎడిషన్‌ వేయాని ఆదేశాలు. నరాలు తెగే ఉత్కంఠ. దాంతో నేను కూడా సంఘటనా స్థలానికి వెళ్లానుకున్న ఆలోచనను మానుకుని రిపోర్టర్లను, ఫొటో గ్రాఫర్లను ఫోన్లోనే అప్రమత్తం చేసుకుంటూ ఆఫీసుకు చేరుకున్నాను. అప్పటికి వార్తలో ఫొటోను స్టూడియోకి వెళ్లి ప్రింట్‌ చేయాల్సివచ్చేది. ఏ దృశ్యమూ మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో ఫొటో గ్రాఫర్లు లెక్కకు మించి ఫొటోలు తీశారు. పొద్దున్నే పోటీ పత్రికకు దీటుగా ఉండాన్న తాపత్రయం ఉంటుంది. దాంతో రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు కూడా ఊపిరి పీల్చుకోలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లో డెస్క్‌ సభ్యుంతా కూర్చుకుని ఎవరేం చేయాలో ప్లాన్‌ చేసుకున్నాం. ఆ ప్రకారమే నాలుగు పేజీలతో ఈవినింగ్‌ ఎడిషన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. భద్రతా సిబ్బంది భుజాపై చేతు వేసి, రక్తమోడుతూ… నిస్పత్తువుగా….రుయా ఆస్పత్రులో సిఎం….షాకింగ్‌ ఫేస్‌! ఫొటోతో ఫస్ట్‌ పేజీ బాగుందని ప్రశంసలు వచ్చాయి. మరేపత్రికా ఈ ఘటనపై ఈవినింగ్‌ ఎడిషన్‌ వేయలేదు. ఆ తరువాత రెగ్యులర్‌ ఎడిషన్‌ ఫస్ట్‌పేజీకి, మెయిన్‌ లోపలి పేజీలు, జిల్లా పేజీకి ఫొటో ఎంపిక, బ్యానర్‌ ఐటం, విడివిడిగా వచ్చిన వార్తను సమప్‌ చేయడం…సవాలుగా మారింది. మరోపక్క మెడమీద డెడ్‌లైన్‌ కత్తి…కాస్త ఆస్యమైనా విజయవంతంగా ఆ రోజు ఎడిషన్‌ ముగిసింది. అప్పటి టెన్షన్‌ను ఇప్పడు చెప్పాంటే అతిశయోక్తిగా ఉంటుందికానీ…. వాస్తవమైతే అదే. ఆ తరువాత దాదాపు రెండున్నర నెలలు అలిపిరి ఫాలోఅప్‌ కోసం రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు చాలా శ్రమపడ్డారు. నాయకత్వ క్షణాలు, నైపుణ్యం ఇలాంటి ముఖ్య సంఘటనలు, విపత్తులు, విళయాలు సంభవించినపుడే బయటపడుతాయి.

ఉరకలు వేసే ఉత్సాహం…
కొన్ని చేదు అనుభవాలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది తిరుపతి. నిత్యకల్యాణం పచ్చతోరణం తిరుమల…బ్రహ్మోత్సవాలు, యూనివర్సిటీలు, విద్యావైజ్ఞానిక వార్తలు పత్రికను తాజాగా ఉంచేవి. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాము నెల్లూరు జిల్లా (అప్పట్లో నెల్లూరు ఎడిషన్‌ తిరుపతి నుంచే వెళ్లేది) భౌగోళిక పరిస్థితి ఒకేలా ఉండవు. అందుకే వార్తలు, కథనాల్లో ఇది ప్రస్పుటించేది. సబెడిటర్‌ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి కావాల్సిన ముడిసరుకు దొరికేది. నా జర్నలిస్టు జర్నీలో తిరుపతి ఓ మంచి జ్ఞాపకం. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాక్షి దినపత్రికలో పని చేస్తున్నాను. కొత్త విషయాుయ నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను.

  • – నజీర్‌, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*