వైభవంగా దక్షిణ కైలాస ముక్తిధామం భూమిపూజ..!

  • అబ్బుర పరచిన నమూనాలు
  • నిజాయితే నాన్న మాకిచ్చిన ఆస్తి : పవిత్రారెడ్డి
  • దేశంలోనే నెంబర్ వన్ గా ముక్తిధామం : ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి ఎంఎల్ఎ బియ్యపు మధుసూదన్ రెడ్డి మానసపుత్రికగా పేర్కొనబడుతున్న దక్షిణ కైలాస ముక్తిధామం(హిందూ స్మశానవాటిక) భూమి పూజ కార్యక్రమం సోమవారం ఉదయం పట్టణంలోని కోర్టు సమీపంలో వైభవంగా జరిగింది. పట్టణంలోని పలు వార్డుల నుంచి మహిళలు పూజించిన ఇటుకరాళ్లతో బ్యాండు మేళాల నడుమ ర్యాలీలు నిర్వహించి భూమిపూజ కార్యక్రమం వద్ద వేదపండితులకు అందజేశారు. ముందుగా ఉదయం 9గం.లకు అధికారులు, నాయకులు, ప్రజల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

దేశంలోనే నెంబర్ వన్ గా శ్మశానవాటిక..
శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్న హిందూ వాటిక దేశంలోనే నెంబర్ వన్ కాబోతున్నట్లు ఎంఎల్ఎ మధుసూధన్ రెడ్డి తెలిపారు. భూమిపూజ అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంఎల్ఎ మాట్లాడుతూ 12 ఎకరాల స్థలంలో 27 కోట్ల రూపాయలు వెచ్చించి ఐదేళ్ళ లో కైలాస ముక్తిధామం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశాలమైన భవనాలు, బర్నింగ్, ఉద్యాన వనాలు , స్నానఘట్టాలు , ఎన్నో అధునాతన సౌకర్యాలతో స్వర్గాన్ని తలపించేలా ముక్తిధామం ఉండబోతున్నట్లు తెలిపారు. అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి మరణదృవీకరణ పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. చనిపోయిన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు తన సొంత ఖర్చులతో దసన సంస్కారాలు చేస్తామన్నారు. మొదటిగా రెండున్నర కోట్ల మున్సిపల్ నిధులతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

నిజాయితే నాన్న మాకిచ్చిన ఆస్తి….
నిజాయితిగా బ్రతకడమే మానాన్న మధుసూదన్ రెడ్డి మాకిచ్చిన ఆస్తి అని, అంతకు మించి మాకు ఏమీ అవసరం లేదని ఎంఎల్ఎ కుమార్తె పవిత్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. తన తండ్రిని ఎంఎల్ఎ చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏమిచేసినా సరిపోదన్నారు.

ఆకట్టుకున్న నమూనాలు
భూమి పూజ సందర్భంగా డిజిటల్ స్కీన్ పై చూపించిన శ్మశానవాటిక నమూనాలు , గతంలో చేసిన లిప్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీరిచ్చే పనులు, స్వర్ణముఖి అభివృద్ధి పనులు, శివరాత్రి ఉత్సవాలు, ఎంఎల్ఎ మొదటి నుంచి చేసిన సేవాకార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి.

విరాళాలు వెల్లువ…
ముక్తిధామం కార్యక్రమానికి ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన పలువురు తమ దాతృత్వం చాటుకున్నారు. ప్రముఖ వైద్యులు, విక్రమ్ విద్యాసంస్థలు అధినేత చంద్రశేఖర్ లక్ష రూపాయలు , మున్సిపల్ మాజీ ఛైర్మెన్ మ్యాగీ క్లారా రూ.50 వేలు, పార్టీ నాయకులు లోకేష్ యాదవ్ వంద ట్రక్కులు మెటల్ , మెడికల్ షాపుల యజమానులు లక్ష రూపాయలు మరో కొంతమంది విరాళాలు ప్రకటించారు.

ఇటుకలు తీసుకొస్తున్న ప్రజలు

ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు, ఆ పార్టీ నాయకులు గున్నేరి కిషోర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, గుమ్మడి బాలక్రిష్ణయ్య, వాసునాయుడు, వడ్లతాంగల్ బాలాజీ రెడ్డి , రవీంద్ర బాబు, ఎంఎస్ రెడ్డి, మధురెడ్డి , దేవస్థానం ఇఓ పెద్దిరాజు , మున్సిపల్ కమిషనర్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, నాయకులు గంధం మణి, జనసేన నాయకులు హంసా మనోహర్ హాజరై బృహత్తర కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*