వైసిపి నేతల సవాలు… చంద్రబాబు మౌనం… టిడిపి నేతల వితండ వాదం !

Nara Chandrababu Naidu

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన శ్రీనివాసులు ఇంటితో పాటు 40 చోట్ల ఐదు రోజుల‌ పాటు తనిఖీలు నిర్వహించిన తరువాత ఆదాయ పన్ను శాఖ అధికారులు విడుద చేసిన‌ ప్రెస్‌నోట్‌ సంచనంగా మారింది. ఈ సోదాల్లో… లెక్క‌లు చూపని రూ.2 వేల‌ కోట్ల లావాదేవీల‌కు సంబంధించి రికార్డు సీజ్‌ చేశామని చెప్పారు. 25 బ్యాంకు లాకర్లు సీజ్‌ చేశామని కూడా వ్లెడిరచారు. ఇందులో విదేశీ పెట్టుబడుల వ్యవహారం కూడా ఉందని ఐటి తమ నోట్‌లో వ్లెడించింది.

ఆదాయ పన్ను శాఖ విడుదల చేసిన ఈ ప్రెస్‌నోట్‌పై టిడిపి అనుకూల‌ మీడియా నోరు మెదపలేదుగానీ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడుగానీ, ఆయన కుమారుడు లోకేష్‌గానీ ఇప్పటిదాకా స్పందించలేదు. దీంతో వైసిపి నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి…చంద్రబాబు పిఎస్‌ ఇంట్లో ఇంత పెద్ద వ్యవహారం బయటపడితే బాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దొరికిపోవడం వల్లే తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు హైదరాబాద్‌కు వెళ్లిపోయి, ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదుపెట్టారని విమర్శించారు.

ఇదే సమయంలో యనమల రామకృష్ణుడు, టిడిపి నేత పట్టాభి వంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి ఏమాత్రం సహేతుకంగా అనిపించని వాదనల‌ను మొదలుపెట్టారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రతి సంవత్సరం తమ ఆస్తుల‌ను బహిరంగంగా ప్రకటిస్తున్నారని, ఇందులో దాపరికం ఏముందని దబాయిస్తున్నారు. ఆస్తు వివరాలు ప్రకటించొచ్చు. అంతమాత్రాన అక్రమాలు జరగలేదని ఎలా చెప్పగరు. ఆస్తు వివరాలు ప్రకటించాకే కదా ఐటి సోదాలు నిర్వహించి రూ.2 వేల‌ కోట్లకు సరిగా లెక్కల్లేని తేల్చింది. దీనికి సమాధానం చెప్పాల్సిందిపోయి…ఎదురుదాడి చేయడం వల్ల‌ ప్రయోజనం ఏముంటుంది?

వైసిపి నేతలు అడుగుతున్నారని కాదుగానీ…బాధ్యత కలిగిన నేతగా చంద్రబాబుపై స్పందించాల్సింది. తన వద్ద దీర్ఘకాం పిఎస్‌గా పని చేసిన వ్యక్తి ఇంట్లో ఐదు రోజు పాటు ఐటి సోదాలు నిర్వహించినపుడే బాబు స్సందించి వివరణ ఇచ్చివుండాల్సింది. పిఎస్‌ శ్రీనివాసులు తనకు తెలియకుండా అక్రమాల‌కు ప్పాడివుంటే అదే విషయం చెప్పివుండొచ్చు. కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో కక్షగట్టి తనకు చెందిన వారిపై ఐటి సోదాలు నిర్వహిస్తుంటే ఆ మాటైనా బయటకు చెప్పాలి. కనీసం రూ.2 వేల‌ కోట్ల అక్రమ లావాదేవీను గుర్తించినట్లు ఐటి అధికారులు ప్రకటించాకైనా చంద్రబాబు నోరు విప్పివుండాల్సింది. ఈ వ్యవహారంలో బాబు తప్ప ఎందరు టిడిపి నేతలు మాట్లాడినా ప్రయోజనం ఉండదు.

అయితే, చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారయింది. ఎన్నిక సమయంలో కొందరు టిడిపి నేతల‌పై ఐటి దాడు జరిగినపుడు….కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి తనవాళ్లపైన దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఆ మాట కూడా అనలేకుండా ఉన్నారు. ఆమాట అంటే…ఇక కేసులో పూర్తిగా చిక్కుకున్నట్లే. కేంద్ర ప్రభుత్వ పెద్దల‌ వద్దకు వెళ్లి కాళ్లో వేళ్లో పట్టుకుని బయటపడేందుకు ఉన్న దారులూ మూసుకుపోతాయి. అలాగని ఐటి దాడుల్లో వ్లెడైన అంశాల‌కూ తనకూ ఎటువంటి సంబంధమూ లేదని చెబితే…భవిష్యత్తు పరిణామాల‌ను ఎదుర్కోడానికి సిద్ధపడాలి. అందుకే చంద్రబాబు మౌనం వహిస్తున్నారు.

సాధరణంగా….తనకు ఇబ్బంది కలిగించే అంశాపై వెంటనే స్పందించరు చంద్రబాబు. మంచి వాదనను తయారు చేసుకుని, ముందుగా తన అనుకూల‌ మీడియా ద్వారా ఆ వాదనను వినిపించి, జనం నమ్ముతున్నారనుకున్నప్పుడు నేరుగా మీడియా ముందుకు వచ్చి పెద్ద స్వరంతో మాట్లాడటం చంద్రబాబు అనుసరించే వ్యూహం. ఈ వ్యవహారంలో కూడా అటువంటి భూమిక సిద్ధమయ్యాక చంద్రబాబు మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

-ఆదిమూం శేఖర్‌, సంపాదకులు , ధర్మచక్రం

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*