వ‌డ్డీ పిచ్చోడు..! అధిక వ‌డ్డీల‌తో కూతుర్నే వేధిస్తున్నాడు!

కొంద‌ర‌కి వ‌డ్డీ పిచ్చి ఉంటుంది. వ‌డ్డీల పేరుతో జ‌నం ర‌క్తం పీల్చుతుంటారు. ఇలాంటి వారికి బంధుత్వాలు, స్నేహాలు వంటివి ఏమీ ఉండ‌వు. అలాంటి వ‌డ్డీ పిచ్చోడు…క‌న్న కూతురినే వ‌డ్డీ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసింది. రూ.5 ల‌క్ష‌ల అప్పుకు రూ.15 ల‌క్ష‌లు వ‌సూలు చేసినా ఇంకా వ‌డ్డీ కోసం వేధిస్తున్నాడట‌. వివ‌రాల్లోకి వెళితే….

కృష్ణా జిల్లా తునికిపాడు గ్రామానికి చెందిన కిలారు హనుమంతరావు కుమార్తె చంద్రలేఖకు రూ.5లక్షలు అప్పుగా ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి రూ.8లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చే సమయంలో వడ్డీతో కలిపి మొత్తం రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయినప్పటికీ అతడి దాహం తీరక.. మరో రూ.5లక్షలు ఇవ్వాలంటూ ఇటీవల ఒత్తిడి తెస్తున్నాడు. కుమార్తె ఇవ్వకపోవడంతో ఆమెకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో పంటసాగు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో చంద్రలేఖ తన తండ్రి వేధింపులపై కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ దర్యాప్తు చేసి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇదంతా వింటుంటే….కార‌ల్ మార్క్ చెప్పిన మాట‌లు గుర్తుకొస్తున్నాయి. మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్థిక సంబంధాలే….అని ఒక‌టిన్న‌ర శ‌తాబ్దం క్రిత‌మే మార్క్ మ‌హ‌నాయుడు చెప్పారు. డ‌బ్బు ఊరికే ఉండ‌దు. అంత‌కంత‌కు పెంచ‌మ‌ని య‌జ‌మానిని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆ య‌జ‌మాని ఏమైనా చేస్తాడు. హ‌నుమంత‌రావును చూస్తుంటే మార్క్ మాట‌లు ఆక్ష‌ర‌స‌త్యాలు అనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*