శభాష్ పోలీస్…మిస్సయిన గంటలోనే భక్తులకు మొబైల్ అప్పగింత.!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి పోలీసుల పనితీరును స్థానికులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న భక్తులు సైతం అభినందనందిస్తున్నారు. భక్తులు పోగొట్టుకున్న ఖరీదైన మొబైల్ ఫోన్ ను గంటలోనే తిరిగి భక్తులకు ఇప్పించి శభాష్ అనిపించుకున్నారు వన్ టౌన్ పోలీసులు. వివరాల్లోకెళితే....కేరళకు చెందిన దంపతులు ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వ రాలయానికి వచ్చారు. పట్టణంలోని సూపర్ బజార్ వద్ద AP03 7478 నెంబర్ గల ఆటోలో ఎక్కి దేవస్థానం సమీపంలోని ఓ లాడ్జీలో దిగారు. హడావుడిలో తమ మొబైల్ ఫోన్ ను ఆటోలో జారవిడుచుకున్నారు. ఫోన్ చేజిక్కిచ్చుకున్న ఆటోడ్రైవర్ మొబైల్ రింగయినా తీయకుండా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో దాచిపెట్టాడు. భక్తులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొబైల్ రికవరీ బాధ్యతను  ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్ బాషాకు అప్పగించారు. 

రంగంలోకి దిగిన రియాజ్ బాషా మరో పోలీస్ బాలాజీని వెంట పెట్టుకుని ఆటో నెంబర్ ఆధారంగా గంట వ్యవధిలోనే ఏపిసీడ్స్ వద్ద ఆటోనడుపుతున్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొబైల్ ఇంట్లో ఉందని డ్రైవర్ తెలిపాడు. దీంతో కొత్త పేటలోని ఆటోడ్రైవర్ ఇంటికెళ్లి మొబైల్ తీసుకుని పోగొట్టుకున్న దంపతులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు రప్పించి సిఐ నాగార్జున రెడ్డి సమక్షంలో భక్తులకు మొబైల్ అందజేశారు. విధుల్లో చురుగ్గా పనిచేసిన పోలీసులను భక్తులు   అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్  టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్ భాషా ,ట్రాఫిక్ పోలీసు బాలాజీ పలువురు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*