శభాష్ పోలీస్…నిబద్ధతకు నిదర్శనం… వాహనదారులకు సింహస్వప్నం..!

రవి, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

ఆయన ఓ సాధారణ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్. అయితేనేం ఆయన అంటేనే ట్రాఫిక్ సమస్యకు హడల్. పట్టణంలో ఎక్కడ ర్యాలీ జరిగినా ,ధర్నాలు జరుగుతున్నా, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతున్నా ఆయన.అక్కడ ఉండాల్సిందే. వృత్తిలో నిబద్ధత, క్రమశిక్షణ ఆయన నైజం. ఆపోలీస్ వస్తున్నాడంటేచాలు ఎవ్వరైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే ఆయన పేరే రియాజ్ భాషా.


నిబద్ధత ఆయన నైజం..
గంగాధర నెల్లూరు మండలం లక్ష్మీ రెడ్డి పల్లెకు చెందిన షేక్ రియాజ్ భాషా ఇంటర్మీడియట్ వరకు చదివి పోలీస్ వృత్తి పై మమకారంతో ఆ వృత్తిలో చేరారు. మొట్టమొదటి సారిగా వాయల్పాడులో 1990లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు. అక్కడ నుంచి తిరుపతి క్రైంలో, చిత్తూరు క్రైంలో కానిస్టేబుల్ గా పనిచేశారు. తదుపరి తిరుపతి లో మొదటిసారి ట్రాఫిక్ పోలీసుగా విధులు చేపట్టిన ఆయన 200లో శ్రీకాళహస్తిలో చేరి ఐదేళ్లు ఇక్కడ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించారు. తదుపరి తిరుపతి లో పనిచేసిన ఆయన్ను ఏడాదిన్నర తిరగక ముందే తిరిగి శ్రీకాళహస్తికి రప్పించడంతో ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.

సాధారణంగా ఉదయం7 గం నుండి మధ్యాహ్నం ఒంటి గంట దాకా, తదుపరి 1గం. నుంచి రాత్రి 9 గం. వరకు ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే డ్యూటీ తో సంబంధం లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో డ్యూటీ చేస్తూ ట్రాఫిక్ క్రమబద్దీకరించడంలో ఆయన దిట్టనే చెప్పాలి. మహాశివరాత్రి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఆయన అన్నివేళలా అందుబాటులో ఉండి డ్యూటీ చేయడం ఆయన విధి. ఒకానొక దశలో రియాజ్ భాషా లేడంటే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదనే స్థాయికి ఎదగారంటే ఆయన నిబద్ధత ఏమిటో అర్దమవుతోంది. డ్యూటీ లో ఆయన సిన్సియారిటీ చూసిన ఎవరైనా సరే ఆయన్ను అభినందించకమానరు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న రియాజ్ భాషా ఇతర ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయిన బాలాజీ, ప్రసాద్, మనోహర్, హేమనాధ్ ,శ్రీనివాసులు, హరి , వెంకటరెడ్డి, బండారుపల్లి వెంకటరెడ్డి, కళ్యాణ్ ల సహకారంతో పట్టణంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య పరిప్కరిస్తూ అందరిచేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఎందరో ట్రాఫిక్ పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*