శివరాత్రి ఉత్సవాల్లో అవినీతిపై కోర్టులో కేసు వేస్తాం : బిజెపి నేతలు

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత ఏడాదితో పోల్చితే ఈసారి అధ్వానంగా నిర్వహించారని బిజెపి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్వామివారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలలో ఎంతో పెరుగుదల ఉందని అన్నారు.

ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలకు దాదాపు 3 కోట్ల రూపాయలను కేటాయించామని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి చెప్పారని, ఇవే కాకుండా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రి ఉత్సవాల పేరు చెప్పి రాష్ట్రాలన్నీ తిరిగి వసూలు చేసిన విరాళాలకు సరియైన లెక్కలు లేవని ఆరోపించారు. ఉత్సవాలకు సంబంధించిన ప్రతి పనిని కూడా బహిరంగ టెండర్లు పిలిపించి పారదర్శకంగా నిర్వహించలసు వుండగా ఇష్టానుసారం చేసారని విమర్శించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రతిబింబించవలసిన చోట దేవస్థాన ఈవో, ఎమ్మెల్యేల ఫోటోలను వేసుకుని ప్రచారం కోసం పాకులాడారని అన్నారు. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఉచితంగా ఉత్సవాలకు పూలను ఇస్తుండగా వాటిని కాదని పూల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు వృథా చేశారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి అంత అధ్వానంగా ఎన్నడూ లేవన్నారు. స్వామివారి ఊరేగింపులో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తులను నిరాశకు పరిచాయన్నారు. స్వామివారి ఊరేగింపుకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలిసేలా వ్యవస్థను ఏర్పాటు చేయలేదని, ప్రతిరోజూ స్వామివారి ఊరేగింపు సమయంలో భక్తులు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఎదుర్కున్నారని చెప్పారు. భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయవలసిన ఆలయ అధికారులు, శాంతి భద్రతలను పరిరక్షించవలసిన పోలీస్ వ్యవస్థ అందరూ స్థానిక ఎమ్మెల్యే ఆదేశానుసారం పని చేశారన్న విషయం భక్తులందరూ చర్చించుకుంటున్నారని అన్నారు.

శివరాత్రి ఒక్కరోజే ఏర్పాటు చేయవలసిన మహాలఘు దర్శనాన్ని తర్వాత రెండు మూడు రోజుల వరకు పొడిగించారని, ఈ సమయంలో కేవలం ఎమ్మెల్యే, వైస్సార్సీపీ పార్టీ అనుచరులు చెప్పిన వారికి మాత్రమే ఆలయం లోపలికి పంపించి దర్శనం చేయించారని విమర్శించారు. ఆలయం లోపల పండ్లతో డెకరేషన్ చేయించి, అవి కుళ్ళిపోయి వాసన వచ్చే వరకు అలాగే పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక ప్రజలు వారి స్వంత డబ్బులతో ఏర్పాటు చేసుకున్న బ్యానర్లను చూసి ఓర్వలేక వాటన్నిటినీ తొలగించి, కేవలం దేవస్థాన డబ్బులతో ఏర్పాటు చేసిన , ఈవో-ఎమ్మెల్యేల ఫోటోలతో ఉన్న బ్యానర్లను మాత్రమే ఉంచడం భావ్యం కాదన్నారు. ఉత్సవాలలో కేవలం వైస్సార్సీపీ పార్టీ అనుచరులకు మాత్రమే ఆలయ ఆల్ యాక్సిస్ పాసులను ఇవ్వటం తగదన్నారు. ఇలా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ప్రతిదీ పద్ధతి తప్పి జరిగాయన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అవినీతిపై కోర్టులో కేసు వేస్తామని చెప్పారు.

ఈ మీడియా సమావేశంలో మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ, మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొట్టా సుకుమార్,రాష్ట్ర మానవ హక్కుల కమిటీ కో కన్వీనర్ గరికపాటి రమేష్, రాష్ట్ర ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు కయ్యురి ఈశ్వరయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాకరాపేట సుబ్రహ్మణ్యం రెడ్డి,కుప్ప ప్రసాద్ కుమార్, జయకృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా సహ కార్యదర్శి గల్లా పుష్ప,మాజీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చాగణం శైలజ, మాజీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి భార్గవి, పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిశోర్, ఉపాధ్యక్షులు కోనేటి సిద్ధులయ్య, శ్రీరాములు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు బొల్లినేని జగన్నాథం నాయుడు, ప్రధాన కార్యదర్శి సాలాపక్షి హరి, కూనాటి నాగరాజు, పుల్లయ్య నాయుడు, కుమార్ నాయుడు, మునిరెడ్డి,నరసింహా రెడ్డి, ఏర్పేడు మండల అధ్యక్షులు గాండ్ల శివకుమార్,మండల ఇంచార్జి మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, తొట్టంబేడు మండల అధ్యక్షులు నాదెళ్ల చెంచు రామానాయుడు, పసుపులేటి చిన్న, నాయకులు పుణ్యం ఢిల్లీ కుమార్,కిరణ్మణి, కోనేటి అయ్యప్ప,కుందేటి గోపాల్,కటికం చందు,శివ, గాలి రమేష్ నాయుడు, హరీష్,సాయి,తాజుద్దీన్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*