శివాజీ గారూ…పవన్‌ను అడుగుతన్న ప్రశ్నబాబును అడగరా!

ఉద్యమకారుని అవతారమెత్తిన సినీనటుడు శివాజీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపతున్నారు. పవన్‌ కల్యాణ్‌ తమపైన చేస్తున్నట్లు బిజెపిపైన, కేంద్రంపైన విమర్శలు చేయడం లేని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లే శివాజీ కూడా ఆరోపిస్తున్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ మోడీని ప్రశ్నించడం లేదు. బిజెపిని ప్రశ్నించడం లేదు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధివుంటే కర్నాటకకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి’ అని సవాల్‌ వంటి గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బిజెపి కర్నాకట ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకోవడంలో శివాజీ కోరుకోవడంలో తప్పులేదు. అయితే….పవన్‌ కల్యాణ్‌ కర్నాటకకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తేనే చిత్తశుద్ధి ఉన్నట్లు చెప్పడంలోనే అభ్యంతరం ఉంది. చిత్తశుద్ధికి అదే కొలమానమైతే… తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నాటకకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? పవన్‌ కల్యాణ్‌ను అడుగుతున్న ప్రశ్న చంద్రబాబును అడగడం లేదు శివాజీ. అయితే…శివాజీ అడగని ప్రశ్నను విలేకరులు ముఖ్యంత్రిని అడిగారు. ‘మీరు కర్నాటకు వెళ్లి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా’ అని విలేకరులు ప్రశ్నించగా…ఆ విషయం మీకు చెప్పాలా? అని ఎదురు ప్రశ్నించారు. ప్రచారం చేయడమనేది రహస్యమేమీ కాదు. ప్రచారం చేస్తాననో, చేయననో చెప్పవచ్చు. ఏదో రహస్యం చెప్పమని విలేకరులు అడిగినట్లు…ఆ విషయం మీకు చెప్పాలా అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వాస్తవంగా తెలుగుదేశం నాయకులు కర్నాటకకు వెళ్లి ప్రచారం చేస్తున్నారట. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి టిడిపిది. ఎందుంటే బిజెపిని ఓడించమని ప్రచారం చేయడమంటే….కాంగ్రెస్‌ గెలిపించమని చెప్పడమే. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బంది అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు బహిరంగంగా కర్నాకటలో ప్రచారం చేయడం లేదు. అయితే…పవన్‌ను ప్రశ్నించడంలో చూపుతున్న శ్రద్ధ ముఖ్యమంత్రిని అడగడంలో చూపడం లేదు. దీనికి కారణాలు ఏమిటో శివాజీనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*