శెభాష్ ఎస్పీ రమేష్ రెడ్డి‌ గారూ…మనసున్న మనిషి‌ అనిపించుకున్నారు..! అంబులెన్స్ సమస్యకు సత్వర పరిష్కారం!

తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మనసున్న మారాజు అని మరోసారి రుజువు చేసుకున్నారు. రోడ్డుపైన అభాగ్యులుగా పడివున్న అనాధలకు… కాసింత నీడ చూపించడమే…వారి ఆలనా పాలనా చూడడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిన రమేష్ రెడ్డి తిరుపతికి వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే….మానవత్వం ఉన్న మనిషిగా అందరి అభినందనలు అందుకున్నారు.‌

తిరుపతి రుయాసుపత్రి వద్ద అంబులెన్స్ నిర్వాహకుల దాష్టీకంతో రోగుల ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్న కొన్ని రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చూపారు. రుయా వద్ద ప్రీ పెయిడ్ అంబులెన్స్ సర్వీసులకు శ్రీకారం చెట్టారు. ఈ సర్వీసులను‌ శనివారం సాయంత్ర ప్రారంభించారు.‌ ఎందరో ఎస్పీలు వచ్చారు వెళ్లారు. అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలను‌ అరికట్డలేకపోయారు. ఏళ్ల తరబడి సాగుతున్న దందాకు రెండు రోజుల్లోనే చరమగీతం పాడారు రమేష్ రెడ్డి. దీంతో పేదల అభిమానాన్ని చూరగొన్నారు. మనసున్న మనిషినని మరోసారి రుజువు చేసుకున్నారు.

ప్రీ పెయిడ్ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా యస్.పి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ నందు జరిగిన సంఘటన చాలా భాదాకరం. తదుపరి ఇలాంటి సంఘటన ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో హాస్పిటల్ యాజమాన్యం, ఆర్.టి.ఓ వారి సహకారంతో అంబులెన్స్ కౌంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడికి పేదవారే కాకుండా ఎంతో మంది ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో వస్తుంటారని, ఇది వారికి దేవాలయంతో సమానమని, ఇక్కడ వారికి అన్యాయం జరగకూడదని‌ అన్నారు.

అంబులెన్స్ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందడం విచారకరం, ఆ ఉద్దేశంతోనే సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా రేట్లను నిర్ణయించామన్నారు. ఇకపై పభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రీ-పైడ్ అoబులన్సు సర్వీస్ లు నడపాలని చెప్పారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అధిక రేటు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన హాస్పిటల్ లో కూడా ఇలాంటి సౌకర్యాలు త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబులెన్స్ వాహనదారులు ఎవరైనా ఇక్కడ నమోదు చేసుకోవచ్చని, స్థానికం అనేది లేదని, అంతా ఒక్కటేనని చెప్పారు. అంబులెన్స్ సర్వీస్ నందు డ్రైవర్ తో పాటు ఒక టెక్నిషన్ ను ఉండేటట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పారు. ప్రీ-పైడ్ అంబులెన్స్ కోసం 98850 84689, 99854 76779, 99859 85091 నంబర్లకు ఫొన్ చేయవచ్చని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ భారతి , ఆర్.టి.ఓ జయశంకర్, డి.యస్.పిలు యస్.బి గంగయ్య, ఈస్ట్ మురళి కృష్ణ, సి.ఐ లు అలిపిరి సుబ్బా రెడ్డి, ఈస్ట్ శివ ప్రసాద్ రెడ్డి, వెస్ట్ శివ ప్రసాద్, యస్.ఐ లు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*