శెభాష్ చెవిరెడ్డి గారూ…కరోనా విపత్తు సమయంలో ప్రజలకు అండ…!

చంద్రగిరి శాసన సభ్యులు, తుడ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎటువంటి‌ సందర్భంలోనైనా తన ప్రత్యేకతను చాటుకుంటారు.‌ కరోనా మహమ్మారి ప్రజలను హడలెత్తిస్తున్న తరుణంలోనూ చెవిరెడ్డి ఇదే ధోరణిలో ముందడుగు వేశారు. కరోనా నుంచి పేద , బడుగు , బలహీన వర్గాల ప్రజలను కాపాడేందుకు సొంత నిధులతో 3.10 లక్షల బాటిళ్ల శానిటైజర్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆమేరకు తిరుపతికి సమీపంలోని స్వగ్రామం తుమ్మలగుంటలో ఈ శానిటైజర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు.

చేతులు కడుక్కునే శానిటైజర్ ను పంపిణీ చేస్తున్న చెవిరెడ్డి, రెడ్డెప్ప

చంద్రగిరి నియోజకవర్గంలో 1609 పల్లెల్లో 1.42 లక్షల ఇళ్లు ఉన్నాయి. మొత్తం 4.84 లక్షల జనాభా ఉంది. ప్రతి ఇంటికి రెండు బాటిళ్ల చొప్పున ఇంటి ఇంటికి ఉచితంగా అందించనున్నారు. నంద్యాలలోని ఫ్యాక్టరీ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ శానిటైజర్లు 16 లారీల ద్వారా తిరుపతికి తెప్పిస్తున్నారు. 80 శాతం ఆల్కాహాలుతో తయారు చేయించిన నాణ్యమైన ఈ శానిటైజర్స్ బాటిళ్లను నియోజకవర్గంలోని వేలాది మంది వాలంటీర్ల ద్వారా ఇంటి ఇంటికి అందించనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఉగాది రోజున ఒకటి, ఈ నెల 31న మరోకటి చొప్పున ప్రతి ఇంటికి రెండు బాటిళ్ల శానిటైజర్లను అందిస్తామన్నారు.

అంతేకాకుండా నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 161 పంచాయతీలు ఉన్నాయని వాటికి ఒక్కో పంచాయతీకి 10 లీటర్ల చొప్పున శానిటైజర్ , అత్యవసర సమయాల్లో ఉపయోగించే మాస్క్ లు, గ్లౌజులు , బ్లీచింగ్ , శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించే ధర్మల్ స్కానర్లతో కూడిన మెడికల్ కిట్లను సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి 271 మంది నియోజకవర్గంలోకి వచ్చారని, వారిని వాలంటీర్ల ద్వారా గుర్తించి గృహ నిర్బంధ పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద అంబులెన్సను అందుబాటులో ఉంచామన్నారు . అంతేకాకుండా కరోనాపై అవగాహన కల్పించేందుకు దాదాపు 2.50 లక్షల కరపత్రాలను ముద్రించి ఇంటి ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు , కులాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఇంటికి శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి కరోనా మహమ్మరి పై చేస్తున్న సంకల్పం యజ్ఞంలోనూ, యుద్ధంలో సైనికుల్లా పనిచేస్తామన్నారు . అందులో భాగంగానే తన వంతుగా ఈ శానిటైజర్స్ , మెడికల్ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు.

పంపిణీ కి సిద్దంగా ఉన్న శానిటైజర్ బాటిళ్లు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*