శ్రీకాళహస్తికి కీర్తదామం…దక్షిణ కైలాస ముక్తిధామం..!

  • రూ.27 కోట్లతో హిందూ శ్మశానవాటిక అభివృద్ధి
  • 26న శంకుస్థాపన
  • పట్టువదలని విక్రమార్కునిలా ఎంఎల్ఎ పరుగులు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ఓ ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపెడతున్నారు శ్రీకాళహస్తి శాసపసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న హిందూ శ్మశానవాటిక అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి. రూ.27కోట్లతో అధునాతన శ్మశానవాటిక ఏర్పాటు లకు ఈ నెల26న శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్మశానవాటిక లేక నానా అవస్థలు
సుమారు లక్ష జనాభా ఉన్న శ్రీకాళహస్తి పట్టణానికి హిందూ శ్మశానవాటిక అనేది ఎప్పటి నుంచో కలగానే ఉంటోంది. గతంలో కనీసం శవాన్ని పూడ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. శ్మశానవాటిక అనేది కనీసం రికార్డుల్లో కూడా ఉండేది కాదు. అయితే 2004లో అప్పటి తహశీల్దార్ సురేంద్ర బాబు స్పందించి స్థలాన్ని శ్మశానవాటికకు స్థలం కేటాయించారు. అప్పటి నుంచి అతీగతి లేకుండా ఉండేది. సమాధులు కూడా పెకిలించి ఇసుక తోడేయడంపై పలుమార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. శ్మశాన స్థలం అభివృద్ధికి రూపాయి కూడా కేటాయించడంలేదని ధర్మపరి రక్షణ పరిషత్ నేత వేలూరు చక్రపాణి కోర్టులో కేసు కూడా వేశారు. కానీ శ్మశానవాటిక అభివృద్ధి అనేది కలగానే ఉంటూవస్తోంది.

శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మధుసూదన్ రెడ్డి

మధుసూదనుడి రాకతో మహర్దశ
తాను గెలిస్తే శ్మశానవాటిక అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చారు ప్రస్తుత ఎంఎల్ఎ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఆ మాటప్రకారం దక్షిణ కైలాస ముక్తిధామం పేరుతో అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. శ్నశానవాటికను రూ.27కోట్ల రూపాయలతో నాలుగు దశల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ కైలాస ముక్తిధామంలో ఒక ఎలక్ట్రికల్ బర్నర్, మూడు సాధారణ బర్నర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎండయినా , వానయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత భవనాలు ఏర్పాటు చేయనున్నారు. స్నానాలు చేసేందుకు మూడు గాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండి చనిపోయిన వారి ఇబ్బందులు తీర్చేందుకు గాను 20 రూములు ఏర్పాటు చేసి అందులో ప్రీజర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే సంతాప మందిరం, ప్రముఖులు సమాధులు ఏర్పాటుకు స్థలాలు, ఒక్కోటి రూ.25లక్షలతో 8 ఆర్చిలు, ఉద్యాన వనాలు ఏర్పాటు చేయనున్నారు.

26న శంకుస్థాపన
దక్షిణ కైలాస ముక్తిధామంకు ఈ నెల26వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జెసిబిలతో ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. మొదటి దశలో 10ఎకరాల చుట్టూ ప్రహరీ, బర్నర్లు ఏర్పాటు చేయనున్నారు. పట్టణవాసులను భాగస్వామ్యం చేసేందుకు ఇంటికో ఇటుక ఇవ్వాలని కోరారు. వైభవంగా ఈ కార్యక్రమం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఎంఎల్ఎ కోటి విరాళం
దక్షిణ కైలాస ముక్తిధామంకు శ్రీకారం చుట్టిన ఎంఎల్ఎ అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యం తో మొదటిగా కోటి రూపాయల విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణ కైలాస ముక్తిధామం పూర్తయితే శ్రీకాళహస్తి చరిత్ర లోనే మధుసూదన్ రెడ్డి నిలిచిపోతారని పలువురు పేర్కొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*