శ్రీకాళహస్తికి కొత్త కాంతులు..!

  • రూపురేఖలు మారనున్న స్వర్ణముఖి నది
  • విద్యుత్ దీప కాంతులతో మెరవనున్న వంతెనలు
  • రూ.3 కోట్లు తుడా నిధులతో నదికట్ట ఆధునీకరణ, పార్కులు
  • నదిని పరిశీలించిన ఎంఎల్ఎ, తుడా విసి

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

దక్షిణకాశి, వాయులింగ క్షేత్ర మైన శ్రీకాళహస్తి రూపురేఖలు పూర్తిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి. ఇప్పటికే స్వర్ణముఖి నది ప్రక్షాళన చేసి గతంలో ఎప్పుడూ లేనివిధంగా స్వర్ణమ్మకు హారతులు ఇచ్చి మెప్పించిన ఎమ్మెల్యే నది ప్రక్షాళనకు మరింత చొరవ తీసుకుం టున్నారు. వంతెనల రూపురేఖలు పూర్తిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయింది. మరోవైపు 3 కోట్ల రూపాయల తుడా నిధులతో నదికట్టపై ఆధునికీకరణ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం తుడా విసి గిరీష, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి స్వర్ణముఖి నది కట్టను పరిశీలించారు. అనంతరం ఆలయ పరిపాలనా భవనంలో   అభివృద్ధి పనుల డెమోను వీడియో క్లిప్పింగ్స్ ద్వారా గిరీషకు వివరించారు. ఆరు నెలలలోపు శ్రీకాళహస్తి రూపురేఖలు పూర్తిగా మార్చనున్నట్లు తెలిపారు.
స్వర్ణముఖిని పరిశీలిస్తున్న ఎంఎల్ఏ, తుడ విసి

శ్రీకాళహస్తి ఇక స్వర్ణమయం…
శ్రీకాళహస్తీశ్వరాలయం
రూపురేఖలు పూర్తిగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా…ప్రస్తుతం దుర్గమ్మ కొండ ఎదురుగా స్వర్ణముఖి నదిలో ఉన్న డ్యామ్ ఎత్తుపెంచి నీళ్లు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. భక్తులు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆలయంలో పూజలకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుతం ఉన్న మూడు వంతెనల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. మూడు వంతెనలు పై అందమైన రంగులు వేయించి, పాము, సాలెపురుగు, ఏనుగు, నెమలి, ఎలుక వంటి చిత్రాలు గీయించి , శ్రీకాళహస్తి విశిష్టత తెలిపేలా ఈచిత్రాలు భక్తులకు కనువిందు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా అమరావతి తరహాలో చీకటి పడితే రంగు రంగుల విద్యుత్ కాంతులతో వంతెనలు మెరిసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిత్యం ఓంనమఃశివాయ గీతం వినిపించేలా ఏర్పాట్లు కు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి అమరావతిలో విద్యుత్ వెలుగులు మెరిపించిన వారిని పిలిపించి వారిచేత డిజైన్ కూడా చేయించినట్లు తెలిసింది. స్వర్ణముఖి నది రెండు వైపులా ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి కి విచ్చేసే భక్తులకు భక్తిభావం మరింత పెంపొందించేలా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం శ్రీకాళహస్తికి విచ్చేసిన తుడా విసి గిరీష కు వంతెనల అభివృద్ధి, తదితరవాటిపై ఎమ్మెల్యే డెమో ద్వారా చూపించారు. కమిషనర్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

రూ.3 కోట్ల తుడా నిధులతో అభివృద్ధి పనులు…
శ్రీకాళహస్తిలో
మూడుకోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రామసేతు వంతెన నుంచి ఆలయం ఎదురుగా ఉన్న వంతెన వరకు నదికట్టపై ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చిక పెంచడం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా దేవస్థానంకు చెందిన రెండున్నర ఎకరాల పూలతోట స్థలంలో ఆహ్లాదకరమైన పూలతోటలు, చిన్నపిల్లల పార్కు , జిమ్, కూర్చోడానికి సిమెంట్ బెంచీలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం తుడా విసి గిరీష, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నదికట్టను పరిశీలించారు. ఫిబ్రవరిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు లోపు ఈ పనులు పూర్తి చేయనున్నట్లు వారిద్దరూ తెలిపారు. ఈకార్యక్రమంలో ఇఓ చంద్రశేఖర్ రెడ్డి, ఇఇ వెంకట నారాయణ, పార్టీ నేతలు అంజూరు శ్రీనివాసులు, జయశ్యామ్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*