శ్రీకాళహస్తిలో అదే జరిగితే…నాలుగు నియోజకవర్గాల్లో టిడిపికి తూట్లు..!

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఎవరో తేలడం లేదు. టిడిపి సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్‌ రెడ్డికి సీటు దాదాపుగా ఖరారైనట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇదే నిజమైతే….ఇక్కడ టిడిపి సీటు ఆశిస్తున్న మాజీ ఎంఎల్‌ఏ ఎస్‌సివి నాయుడు నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయానికి తూట్లు పొడవటం ఖాయం.

బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఎన్నికల బరిలో ఉండివుంటే…ఆయనకే టికెట్టు లభించేది. అయితే…ఆరోగ్యకారణాల రీత్యా తన కుమారుడు బొజ్జల సుధీర్‌ రెడ్డికి టికెట్టు ఇవ్వాలని బాబును కోరారు. అయితే…గోపాలక్రిష్ణారెడ్డి బరిలో వుంటే తమకు ఇబ్బంది లేదని, మరొకరికి ఇచ్చేట్లయితే సీనియర్లకే ఇవ్వాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నారు. ఎస్‌సివి నాయుడు కూడా ఇదే వాదన వినిపిస్తూ తనకు టికెట్టు ఇవ్వాలని కోరుతున్నారు.

తనకే టికెట్టు వస్తుందని ఎస్‌సివి నాయుడు ధీమాగా ఉన్నప్పటికీ….నారా లోకేష్‌తో ఉన్న సంబంధాల రీత్యా సుధీర్‌ రెడ్డికే టికెట్టు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే….ఎస్‌సివి నాయుడు వర్గం నుంచి సుధీర్‌ రెడ్డికి సహకారం లభించే అవకాశం లేదు. ఆయనకు శ్రీకాళహస్తితో పాటు పక్కనే ఉన్న సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లోనూ మంచి పట్టువుంది. అనుచర గణం ఉంది. ఎస్‌సివికి టికెట్టు దక్కకుంటే…ఎస్‌విసి అనుచరులంతా టిడిపికి వ్యతిరేకంగా పని చేస్తారనడంలో సందేహం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*