శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు కలకలం..!

  • పోలీసుల అదుపులో నిందితులు
  • ముక్కంటి ఆలయ ఉద్యోగి కూడా

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజల వ్యవహారం చర్చానీయాంశంగా మారింది. శ్రీకాళహస్తీశ్వ రాలయానికి అనుబంధం గా వేడాం గ్రామం సమీపంలోని భైరవకోనలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేస్తున్న నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను అరెస్టు చేయగా వారి సమాచారం మేరకు దేవస్థాన ఉద్యోగిని అర్ధరాత్రి అరెస్టు చేయడం చర్చానీయాంశంగా ఉంది.

వేడం గ్రామం సమీపంలో వేయిలిం గాలస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న భైరవకోనలో కాళభైరవస్వామి ప్రసిద్ధి. మహాశివరాత్రి, నూతన సంవత్సరం వంటి ముఖ్యమైన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ జనసంచారం పెద్దగా ఉండదు. మంగళవారం స్వర్ణముఖి హారతి సందర్భంగా అధికారులు అంతా ఇక్కడే తిష్టవేసి ఉండటం పైగా ఆమావాస కావడంతో తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు కాలభైరవ ఆలయం వద్ద అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు పూజలు చేస్తున్న ఐదుమందిని అదుపులోకి తీసుకుని విచారించగా దేవస్తానంలో పనిచేసే ఓ ఉద్యోగి సూచనల మేరకే తాము పూజలు చేస్తున్నట్లు తెలపగా అర్ధరాత్రి దేవస్థాన ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గతంలోనే సస్పెన్షన్ కు గురైన ఉద్యోగి…
దేవస్థానం లో పనిచేస్తూ పోలీసులు విచారణలో ఉన్న ఆ ఉద్యోగిని గతంలోనే సస్పెండ్ చేసినట్లు సమాచారం. సదరు ఉద్యోగి ఎప్పటి నుంచో కాళభైరవస్వామి ఆలయంలో అర్ధరాత్రి పూజలు నిర్వహించేవారనే ఆరోపణలున్నాయి. గతంలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే ఆరోపణలతో సదరు ఉద్యోగిని అప్పటి ఇఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు. తదుపరి విధుల్లో చేరిన ఆ ఉద్యోగి మళ్లీ అదేకేసులో పోలీసు విచారణలో ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఈకేసు విచారణ ను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*