శ్రీకాళహస్తిలో టిడిపి ధర్నా..!

ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఇసుక రీచ్ ల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల భవన నిర్మాణ రంగం కుదేలు అవుతోందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో ఇసుక రీచ్ లను చక్కగా నిర్వహించామని, ఎన్నడూ ఇసుక కొరత తలెత్తలేదని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చినాక ఉద్దేశపూర్వకంగా ఇసుక కొరత సృష్టించారని ఆరోపించారు. సామాన్యుల అవసరం కొద్దీ ఇసుక తీసుకెళ్తుంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు పోలీసు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గురవయ్య నాయుడు, విజయ్ కుమార్, కామేష్ యాదవ్, చెంచయ్య నాయుడు, మిన్నల రవి, చక్రాల ఉష, గురవారెడ్డి, బాలిశెట్టి వర్మ, షాకిర్ అలీ, మస్తాన్, ఆర్ముగం, సుహాసిని, రేణుకాదేవి, ఎంఎస్ రెడ్డి, మునిరాజా, శ్రీనివాసులు రెడ్డి, బషీర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*