శ్రీకాళహస్తిలో 10,000 ఇళ్లకు బియ్యం పంపిణీ చేసిన ఎంఎల్ఏ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వలన ప్రజలు ఆహారానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందరూ ముందుకు వచ్చి సహకారం అండిచాలని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు. పట్టణంలోని 10,000 ఇళ్లకు 5 కేజీలు బియ్యం చొప్పున అందించారు. సుమారు 50 టన్నల బియ్యాని 30 ట్రాక్టర్ లలో తీసుకొని వచ్చి అందించారు. బియ్యంతో పాటు దోసకాయలు, నిమ్మకాయలు అందించారు . ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ రావడం వలన ప్రజలు కొంచం ఇబ్బంది అయినప్పటికి కఠినంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని , కాంటెక్ట్ కేసులు రాకుండా ఉండాలంటే మరికొన్ని రోజులు పాటించాలని కోరారు. మరీ అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రాకూడదని , శుభ్రత పాటించాలని కోరారు . పట్టణంలోని పెళ్లి మండపము వద్ద పారిశుద్యాన్ని పరిశీలించి తానే స్వయంగా బ్లీచింగ్ చల్లారు . ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ సిపి పార్టీ నాయకులు అంజూరు శ్రీనివాసులు , గుమ్మడి బాలకృష్ణ, లోకేశ్ యాదవ్ , సిరాజ్ బాష , గోరా, రామచంద్ర రెడ్డి, నాని, మున్నా రాయల్, మస్తాన్, వెంకటచలం, కుమార్ స్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

50 ట్రాక్టర్లతో బియ్యం సంచులు‌ తరతరలిస్తున్న దృశ్యం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*