శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం…మొదలు కాక ముందే దర్శనాలు వాయిదా..!

దక్షిణకాశిగా పేరుపొందిన శ్రీకాళహస్తి ఆలయంలో కరోనా కలకలం సృష్టించింది. 80 రోజుల అనంతరం బుధవారం నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించిన తరుణంలో ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాలిటి వచ్చింది. దీంతో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన దర్శనాలు వాయిదా వేసినట్టు చంద్రశేఖర్రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు.

చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా కేసులు శ్రీకాళహస్తిలో నమోదయ్యాయి. ఎక్కడ కేసుల సంఖ్య 100కు చేరింది. ఈ పరిస్థితుల్లో దర్శనాలపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా అధికారులు సమీక్షించి బుధవారం నుంచి దర్శనాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 71 మంది సిబ్బందికి కరోనస పరీక్షలు నిర్వహించారు. ఇందులో 15 మంది రిపోర్టులు వచ్చాయి. ఒక అర్చకునికి పాజిటివ్ గా తేలింది. అన్ని రిపొర్టులు వస్తేగానీ మొత్తం ఎంతమంది వ్యాధిబారిన పడ్డారో తెలీదు. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన దర్శనాలను నిరవధికంగా వాయిదా వేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*