శ్రీకాళహస్తి ఆలయంలో నూతన ఈఓ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు

దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో నూతన కార్యనిర్వహణ అధికారి గా చంద్రశేఖర్ రెడ్డి రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం నుంచి దేవస్థానం మరియు రాహు కేతు పూజ మండపాలు, దేవస్థాన పరివార ప్రాంతాల లో ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ జరిగే కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా స్వామి, అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడమే లక్ష్యం అని అన్నారు. భక్తులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*