శ్రీకాళహస్తి గుడికి కరోన ఎఫెక్ట్..!

  • బోసిపోయిన క్యూలైన్లు…!! –
  • వెలవెలబోతున్న ఆలయం..!!
  • రద్దయిన హారతులు… ఇన్నర్ దర్శనం
  • రేపటి నుంచి సర్పదోషపూజలు, అభిషేకాల రద్దు..?

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం శ్రీకాళహస్తి గుడికి కరోన ఎఫెక్ట్..! పైనా పడింది. భక్తుల రద్దీతో కళకళలాడుతూ ఉండే ఆలయం బోసిపోయింది. క్యూలైన్లు నిర్మాణుషంగా మారాయి. భక్తుల రద్దీ బాగా తగ్గింది. కరోనా ప్రభావంతో ఆలయంలో ఇన్నర్ దర్శనం, హారతులు, కుంకుమ పెట్టడం రద్దు చేశారు. సర్పదోషపూజలు, అభిషేకాలు రద్దుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఖాళీగా దర్శనమిస్తున్న క్యూలైను

శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం 30 వేలు – 40వేల మంది భక్తులు విచ్చేస్తుంటారు. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. నిత్యం సర్పదోషపూజలు అధికంగానే జరిగేవి. అలాంటి ముక్కంటి ఆలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. సోమవారం అయినప్పటికీ ఉదయం తొమ్మిది గంటలకే క్యూలైన్లు నిర్మాణుషంగా మారి దర్శనమిచ్చాయి. ఆలయ పరిసరాలన్నీ బోసినా ఉంటున్నాయి. ఆలయ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సైతం ముఖానికి గుడ్డలు కట్టుకుని దర్శనానికి వెళ్లే పరిస్థితి. ఆలయంలో రోగాల నివారణకు మందు చల్లుతున్నారు. ఉద్యోగులతో పాటు, భక్తులు భయం భయంగా గడుపుతున్నారు.

కరోనా ప్రభావంతో సోమవారం నుంచి ఆలయంలో హారతలు, ఇన్నర్ దర్శనం రద్దు చేశారు. విఐపిలు దర్శనానికి వచ్చిన బయట నుండి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యమైన సర్పదోషపూజలు, అభిషేకాలు నిలుపుదల విషయమై దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి అవికూడా రద్దు కానున్నట్లు సమాచారం. ఫలితంగా ఆలయ ఆదాయానికి భారిగా నష్టం వాటిల్లనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*