శ్రీకాళహస్తి : బయటరావొద్దు…ఏంకావాలన్నా ఫోన్ చేయండి..!

శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం నందు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ అధికంగా ఉండడంతో శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ అలర్ట్ జోన్ ప్రకటిస్తున్నామని, రేపటి నుంచి ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా 24 గంటలూ ఇంటి వద్దనే ఉండాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అత్యావసర సరుకులు కావాలంటే… వార్డు వాలంటరీల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా 9849907502 నెంబర్ కి ఫోన్ చేసి సేవలు పొందాలని, ఇదే ఫోన్ నెంబర్ కు వాట్సాప్ కనెక్ట్ అయి ఉంటుందని, ఆ వాట్స్అప్ ద్వారా ప్రజలు ఎటువంటి సహాయం కావాలన్న మెసేజ్ లు పంపాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నా వార్డు వాలంటరీ లు సకాలంలో అందజేస్తారని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ప్రజలు రేపటినుంచి నుంచి పట్టణ వీధుల్లో కనిపిస్తే వారిపై కఠినమైనచర్యలు తీసుకొని వారిని అరెస్టు చేసి కోరంటైం తరలిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మహమ్మారి చైన్ లింక్ కట్ చేయాలంటే ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అవుతుందని, దీని ప్రజలందరూ అర్థం చేసుకుని అధికారుల ఆదేశాలను పాటిస్తూ వాలంటీర్ల వద్ద సేవలు పొందుతూ తగు రక్షణలు ప్రజలు ఉండాలని ప్రజలందరిని అభ్యర్థించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*