శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వేళాయె..!

సుదీర్ఘ కరోనా లాక్‌డౌన్ అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం మొదలు కానుంది సోమవారం (15.06.20) నుంచి దర్శనాలు మొదలవుతాయి. మొదటిరోజు ఆలయ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తారు. రెండోరోజు మంగళవారం పట్టణవాసులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. బుధవారం నుంచి సమస్త భక్త జనావళికి దర్శనం లభిస్తుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

ఈఓ చంద్రశేఖర్ రెడ్డి

వాస్తవంగా గత బుధవారం ఆలయంలో దర్శనాలు మొదలు కావాల్సి ఉంది. ఒకరోజు ముందుగా ఆలయంలో పనిచేసే ఒక అర్చకునికి కరోనా సోకడంతో దర్శనాలు ప్రారంభించ కుండానే వాయిదా వేశారు. అందరికీ పరీక్షలు చేసిన తర్వాత, ఎవరికీ కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వం సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది.

భౌతిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఈవో చెప్పారు. భక్తులందరికీ థర్మల్ పరీక్ష ద్వారా శరీర ఉష్ణోగ్రత చూసి, జ్వరం లేదని నిర్దారించుకున్నాకే దర్శనానికి‌ అనుమతిస్తామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*