శ్రీదేవి మరణంతో నాగర్జునలో వచ్చిన మార్పు ఏమిటి?

శ్రీదేవి హఠాన్మరణం కోట్లాదిగా ఉన్న ఆమె అభిమానులను కలచివేసింది. జనం కన్నీరు పెట్టుకున్నారు. రాంగోలాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గోవింద గోవింద’లో శ్రీదేవితో నటించిన నాగార్జున, ఓ సందర్భంలో శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఆమె మరణంతో తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. రాంగోల్‌ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆఫీసర్‌’ సినిమా విశేషాల గురించి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన నాగార్జునకు, గోవింద గోవింద సినిమా నాటి సంగతులు కళ్లముందు మెదిలాయి. ‘ఆమె కెమెరా ముందు ఉన్నంత సేపు హుషారుగా, ఆనందంగా ఉండేవారు. కెమెరా నుంచి పక్కకు వెళ్లగానే నిజ జీవితంలోకి వెళ్లిపోయేవారు’ అని చెప్పారు. అంటే ముభావంగానో, దిగులుగానో ఉండేవారని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అది వేరే సంగతిగానీ….శ్రీదేవి మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకున్నాను. జీవితం చాలా అనూహ్యంగా ఉంటుంది. అందుకే ఉన్నంతకాలం ఆనందంగా, పాజిటివ్‌గా ఉండాలనుకున్నాను. నేను ఇష్టపడేవారిని మరింతగా అభిమానిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను అని చెప్పుకొచ్చారు నాగార్జున. బంధువుల వివాహం కోసమని దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి, వివాహ వేడుకలు చాలా సంతోషంగా గడిపారు. కొంత సేపటికే ఆమె బాత్‌రూమ్‌ టబ్‌లో పడి మరణించారు. దీంతో శ్రీదేవి అభిమానులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*