శ్రీనివాస మంగాపురంలో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలి…

‘భక్తులతో భవదీయుడు’ కార్యక్రమంలో టిటిడికి భక్తుల సూచన

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం అన్నారు. ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగింది.
ఈ సందర్భంగా భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో పలువురు భక్తులు ఫోన్‌ఇన్‌ ద్వారా జెఈవోకు తెలియజేశారు. కాకినాడకు చెందిన సుధారాణి ఒంటిమిట్టలో టిటిడి ఏర్పాట్లను ప్రశంసించారు, మరిన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు.
దీనిపై జెఈవో మాట్లాడుతూ ఇటీవల ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి కల్యాణాన్ని రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహించాం, కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులు వేచి ఉండే గదులను ఆస్థాన మండపం సెల్లార్‌లోని పాత అన్నప్రసాద భవనంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విజయవాడకు చెందిన కృష్ణరావు, ప్రభాకర్‌రాజు టిటిడి కల్యాణ మండపాలను ఆధునీకరించాలని కోరారు.
జెఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాలను దశలవారీగా ఆధునీకరించనున్నట్లు తెలిపారు. టిటిడి కల్యాణ మండపాలను ఐఎస్‌వో సూచనలకు అనుగుణంగా రూపొందిస్తామన్నారు. ఆయా కల్యాణ మండపాల పరిధిలోని డెప్యూటీ ఈవోలు, ఇఇలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేల చర్యలు చేపట్టామన్నారు.
శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాస్‌ తిరుపతిలోని శ్రీనివాసం వసతి సమూదాయంలో రాక పోకల సమయంపై భక్తులకు అవగాహన కల్పించాలని కోరారు..
జెఈవో మాట్లాడుతూ టిటిడి వసతి సముదాయాలలో రాక పోకల సమయాలపై సీనియర్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామన్నారు.
విజయవాడకు చెందిన జహ్నవి ”రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో టిటిడి ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవలను” ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై జెఈవో స్పందిస్తు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో దివ్వక్షేత్రాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో శ్రీవారి ఆలయన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలో టిటిడి విద్యా సంస్థలు, వైద్య శాలలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాన్ని పరిశీలిస్తాం.
కృష్ణాజిల్లా నుండి ప్రభాకర్‌రాజు రాష్ట్రంలోని ప్రముఖ రైల్వేస్టేషన్‌లలో రామక్రిష్ణ మఠం బుక్‌స్టాల్స్‌లో టిటిడి ప్రచురణలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు..
జెఈవో మాట్లాడుతూ టిటిడి ప్రచురణలు తిరుపతి తదితర రైల్వే స్టేషన్‌లోని బుక్‌స్టాల్స్‌ ఉన్నాయని, భక్తులు టిటిడి వెబ్‌పైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చాన్నారు.
అనంతపురం నుండి రవికుమార్‌ శ్రీవారిసేవకులు ఆన్‌లైన్‌లో సేవలు పొందేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారని, శ్రీవారిసేవకులు సులభంగా సేవకు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోరారు.
జెఈవో స్పందిస్తు సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారిసేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో అందిస్తున్న సేవలపై డాక్యుమెంటరి రూపొందించామని, త్వరలో ఎస్వీబీసిలో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
కడపకు చెందిన శ్రీనరేంద్రబాబు విద్యార్థి దశ నుండి పిల్లలలో భక్తిభావం పెంపొందించేందుకు స్కూల్‌ పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు.
జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాలను పిల్లలు దర్శించవచ్చని, గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా ధర్మప్రచారం చేసేందుకు ప్రతి గ్రామంలో ప్రచారకులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
తిరుపతికి చెందిన రిత్వీక తిరుపతిలో మధ్యనిషేదంపై, రావు శ్రీనివాసమంగాపురం ఆలయంలో ప్రసాదాల విక్రయం, ఉమాపతి ఆర్‌టిసి బస్టాండ్‌ నుండి అలిపిరి మార్గంలో తాగునీటి కొలాయిలు ఏర్పాటు చేయాలని కోరారు.
జెఈవో మాట్లాడుతూ తిరుపతిలో సంపూర్ణ మధ్యపాన నిషేదం ప్రభుత్వ పరిధిలోనిదని, దేవాలయాల పరిసరాలలో ఉంటే భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో లడ్డూ, వడ, పులిహోరా ప్రసాదాలను విక్రయించాలన్న భక్తుల కోరికను పరిశీలిస్తామన్నారు. తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌ నుండి అలిపిరి వరకు నడిచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం రెండు ప్రాంతాలలో తాగునీటి కొలాయిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో శుక్రవారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు టిటిడి అనుబంధ ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించిన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా 19 మంది భక్తులు టిటిడిలోని వివిధ విభాగాలకు చెందిన అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారన్నారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలమంలో లడ్డూ ప్రసాదాలను ప్రయోగాత్మకంగా విక్రయించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 48 టిటిడి అనుబంధ ఆలయాలలో తనిఖీలు నిర్వహించి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో ఆర్జితసేవలు, వసతిని అందుబాటులోనికి తీసుకురావడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేసున్నారన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వేదం – ధర్మం వ్యాప్తి చేయడానికి, రామాయణం, మహాభారతం తదితర మహాగ్రంథాలలోని సారాంశాన్ని తెలియజేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇతర దేశాలలో చతుర్వేదాలు, ఇతిహసాలు, దశావతారాలు, సనాతన ధర్మం విలువలు, భాధ్యతలను తెెలిపేందుకు ఈ ఏడాది జూన్‌, జూలై నెలలో ప్రముఖ పండితులు అక్కడి విద్యార్థులకు భోదించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు ఝాన్సీరాణి, ధనంజయులు, రామూర్తిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*